అప్పుల నుండి బయట పడడం ఎలా?
డబ్బు డబ్బు డబ్బు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు, అసలు మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. డబ్బు ఉన్నవాడు గొప్పవాడు కాదు. దానిని ఎలా వాడాలి, ఇంకా దాన్ని ఏ విధంగా రెట్టింపు చేయాలి అని ఆలోచించి,ఆచరించేవారు అసలైన తెలివైనవారు.సమాజంలో ఎక్కువ మంది అప్పులతో ని బ్రతికేవారే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ అప్పులున్నాయని బాధ పడుతూ ,వాటిని ఏ విధంగా తీర్చాలి అనే ఆలోచన చేయరు. మా జీవితం ఇంతే అని బాధపడుతూ ఉంటారు.ఇలాంటి వారి జీవితాలు మారాలంటే ఆలోచించే విధానం మారాలి.
అప్పులు చేయాలన్నా, తీర్చాలన్నా,ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలి.అప్పులు చేయడానికి ప్లానింగ్ ఎందుకు అనుకుంటున్నారా.చాలా మంది సరదాల కోసం అప్పులు చేస్తుంటారు.అలాంటి వారు సంపాదించే జ్ఞానం ఉన్నా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోరు.ఎంతసేపు ఎలా ఎంజాయ్ చేయాలని మాత్రమే ఆలోచిస్తారు. చేసిన అప్పులు కట్టాల్సిన సమయం వచ్చినపుడు మరొక దగ్గర అప్పు చేసి అప్పు తీరుస్తారు. ఈ క్రమంలోనే వడ్డీలు చక్రవడ్డీ లుగా మారిపోతాయి.ఆ వ్యక్తి అప్పుల్లో కూరుకుపోతాడు.ఎలాంటి సంపాదన లేకపోవడమే కాక,ఆ అప్పులు తీర్చడానికి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవల్సిన పరిస్థితి వస్తుంది.వస్తుంది కాబట్టి అప్పు,చేసినా,సంపాదన చేసినా ప్లానింగ్ తోనే చేయాలి.
ముందుగా ఏ సందర్బాలలో అప్పులు చేయాలి చూద్దాం.
1. హాస్పిటల్ కోసం
2.ఆస్తులు కొనేటప్పుడు
1. మన స్తోమత కి మించి హాస్పిటల్ లో ఖర్చు వస్తే తప్పదు కదా అప్పు చేయడం. అలాంటి సమయంలో అప్పు చేయాలి.
2. ఆస్థులు కొనేటపుడు అప్పు చేయాలి.అది కూడా అన్ని ఆస్తులు కాదు. ఫ్యూచర్ లో మనకు పెట్టుబడి కంటే రాబడి ఎక్కువగా వస్తుంది అనే వాటికోసం మాత్రమే అప్పులు చేయాలి.
ఎలాంటి వాటి కోసం అప్పు చేయకూడదు.
1.అందరూ ఇల్లు కట్టుకోవడం కోసం అప్పు చేయడం కరెక్ట్ అనుకుంటారు.కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఇంటి కోసం అప్పు చేయకూడదు అంటారు.ఇల్లు కేవలం మన అవసరం కోసమే ఉండాలి తప్ప దాని కోసం ఆప్పు చేసి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదంటారు.ఇతరులకు అందంగా కనిపించడం కోసం అనవసరపు ఖర్చులు చేయకూడదు,కేవలం మనకు అవసరం ఉన్నంత వరకే కట్టుకోవాలి.ఇంట్లో ఉండే furniture కూడా అవసరమైంది మాత్రమే ఉండాలి అంటారు.ఎందుకంటే ఫ్యూచర్ లో ఇల్లు ద్వారా ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి.
2. Car- దీనికోసం కూడా చాలామంది లోన్ తీసుకుని కొనుక్కుంటారు.కానీ అప్పు చేసి కొనాల్సిన అవసరం లేదు.కార్ కొన్న తర్వాత దాని mantanance ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు side income ద్వారా సంపాదించుకుంటాం అనే ధైర్యం ఉంటే కొనుక్కోవచ్చు.
3. ఆస్తులు.అన్ని ఆస్తులు అధిక దిగుబడి ఇవ్వవు.కాబట్టి ఆలోచించి కొనాలి.ex. ఒక ఇల్లు కొన్నరనుకొండి.అది సిటీ లో ఉంది ఎక్కువగా రెంట్ వస్తుంది చేసిన అప్పుకి వడ్డీ
మరియు కొంచెం అసలు కూడా కట్టోచ్చు ఆ rent తో అనుకుంటే చేయండి.లేకపోతే అప్పు చేసి అలాంటి వాటిని కొనకూడదు.
4.ఇంట్లో వస్తువులు.అప్పు చేసి ఇంట్లో వస్తువులు కొనకూడదు.క్రెడిట్ కార్డ్స్ వాడి అసలే కోనరాదు.
5. సినిమాలకి, షికార్లకి అసలే అప్పు చేయకూడదు.చాలా మంది ఇలా చేస్తుంటారు.
6. పెళ్ళిళ్ళు,ఇతర functions కోసం కూడా అప్పులు చేయకూడదు.
గొప్పలకు పోయి అప్పులపాలు కాకూడదు. function ki ఎవరెవరో వస్తారు సింపుల్ గా చేస్తే ఏమనుకుంటారు.అని మాత్రం అస్సలు అనుకోకూడదు మన బడ్జెట్ చూసుకుని మనం చేసుకోవాలి.
అప్పులు ఏ విధంగా తీర్చాలి?
ముందుగా ఒక notebook తీసుకుని దాంట్లో, మీ అప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి,ఎన్నెన్ని ఉన్నాయి, ఏ అప్పుకు ఎంత వడ్డీ అని రాసుకోవాలి. ఈ notebook మీ lifelong మీతోనే ఉండాలి.
వడ్డీ ఎక్కువ ఉన్న అప్పు ముందుగా తీర్చడం మీ టార్గెట్. ఈ అప్పు తక్కువే కదా ఎక్కువ అప్పు ముందు తీర్చాలి అనుకోకూడదు.వడ్డీ ఎక్కువ ఉన్న అప్పునే ముందుగా తీర్చాలి.తర్వాత వడ్డీ తక్కువ ఉన్న అప్పు తీర్చుకోవాలి.
notebook లో రాసుకోవాలిసింది.
నెలకి మీ సంపాదన ఎంత?
1.EMI లు ఎంత?
2.చిట్టిలు ఎంత?
3.ఇంట్లో అత్యవసర సరుకుల కర్చు ఎంత?
ఇవన్నీ రాసుకోవాలి.
ఇక్కడ 1,2 ఖచ్చితంగా కట్టాల్సినవే.కానీ 3 వది చూడండి అత్యవసర ఖర్చులు,గమనించండి .supermarket కి వెళ్తాం.వెళ్ళేముందు ఇంటిదగ్గర 6000₹ తీసుకుని,supermarket లో 4000rs vi సరుకులు తీసుకుందాం.మిగతావి మిగతా ఖర్చులకి అనుకున్నామనుకో,కానీ supermarket కి వెళ్లి బిల్ వేయిస్తే 6000 బిల్ వస్తుంది.అప్పుడేం చేయలేక కట్టి వస్తాం.
కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసి సరుకులు కొనాలి. ఈ విషయంలో మగాడి కంటే ఆడవాళ్లే ఎక్కువ జాగ్రత్త పడాలి.
ఇవి చిల్లరలాగే కనిపిస్తాయి కానీ కొన్ని కొన్ని ఒక దగ్గర కూడబెట్టి కొన్ని నెలల తర్వాత చూడండి అప్పుడు తెలుస్తుంది చిల్లర విలువ.
సరదాల కోసం నెలకి ఎంత ఖర్చు అవుతుంది,వాటిలో తగ్గించే అవకాశం ఉందా,ఉంటే తగ్గించండి.
ఇక్కడ సరదాల కోసం అంటే సినిమాలకి,హోటల్స్,అవసరం లేని షాపింగ్,ప్రతి పండగలకి కొత్త బట్టలు కొనడం.అప్పులు ఉన్నవాళ్ళము ఇవన్నీ మనకు అవసరమా? భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మనిషే తెలివైనవాడు,కానీ ఇతర జీవులతో పోలిస్తే మనిషే తెలివి తక్కువవాడు.ఎందుకంటే మన తెలివిని మనం ఉపయోగించుకోవటం లేదు.కాబట్టి చేసే ప్రతి పని ఆలోచించి చేయాలి.
ఈ విధంగా ప్రతి నెల కొంచెం కొంచెం మిగిలించాలి.
ఇంత ప్లానింగ్ వేసుకున్న ఏమి మిగలటం లేదు అప్పుడు
ఏదైనా part-time job చేయాలి.లేదా duty time కాకుండా మిగతా టైం లో ఏదైనా చిన్న business చేయడానికి వీలైతే అదీ చేయండి.
Savings చేయడం, మగవారికంటే ఆడవాళ్లే ఎక్కువ చేయగలరు.మగవాడికి అంటే ఒక భర్త కి, భార్యే బలం, భార్యే బలహీనత. చాలా మంది భర్తలు ఇంట్లో ఆడవాళ్ళకి అప్పులు,సంపాదన గురించి చెప్పరు.అడిగితే నీకెందుకు నువ్వు అప్పులు కడతావా అంటారు.అలా కాకుండా భార్య బలం అవ్వాలంటే ఇంట్లో జరిగే ప్రతి లావాదేవీలు ఆడవాళ్ళకు కూడా తెలియాలి.అప్పుడే వారు ఖర్చుల విషయంలో ఎక్కడ తగ్గాలో,ఎక్కడ నెగ్గాలో తెలుసుకుంటారు.అప్పుడు తీర్చేందుకు భర్త పడే కష్టాలు చూడలేక తను కూడా సంపాదించడంలో భర్త కి సహాయపడుతుంది.
బలహీనంగా ఎపుడు మారుతుందంటే ఏ విషయాలూ చెప్పకుండా ఆడదాన్ని వంటింటికే పరిమితం చేస్తే తను అలాగే ఉండిపోతుంది. ఎలాగైతేనేం తన అవసరాలు తాను తీర్చుకోవాలని అనుకుంటుంది తప్పా savings చేయడం అసలు పట్టించుకోదు.
కాబట్టి మధ్య తరగతి కుటుంబాల్లో ఒక్కరే బాధ్యత తీసుకుని, అప్పుల టెన్షన్ పడి ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా, కుటుంబంలో అందరూ కలిసి అప్పుల నుండి బయట పడి సంతోషంగా జీవించాలి.
అందుకోసం చిన్న చిన్న ఆనందాలు కొల్పోక తప్పదు.
అప్పు లేని వాడే నిజమైన సంపన్నుడు.కాబట్టి వీలైనంత వరకు అప్పులకి దూరంగా ఉండండి.ఉన్న అప్పులను సరైన ఆలోచనలతో (నిర్ణయాల) తీర్చుకోండి
*డబ్బు,పని పైన మీకున్న అభిప్రాయాన్ని మార్చే కథ తెలుగులో*
మీ సమయం అస్సలు వేస్ట్ అవ్వదు.👇👇👇👇
*ప్రపంచం లోనే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తం*
*Rich dad poor dad పుస్తకము యెక్క సమ్మరీ*
ధనవంతులు తమపిల్లాలకు డబ్బు గురించి చెప్పిన విషయాలు తెలుగులో...
*మీ మొబైల్ తో మీరే e-filing చేయండి*
e-filing చివరి తేది 31/7/2022
Complete tutorial కొరకు కింది లింక్ ను వాడండి.
0 Comments