కాలువ (పైప్ లైన్ )కథ
18వ శతాబ్దం లో ఇటలీలో లోయ
నగనగనగా ఒకనాడు విక్రం,ఆదిత్యఅనే ఇద్దరు యువకులు 'ఇటలీలో ఒక గ్రామంలో ఇరుగుపొరుగున వుండేవారు. వారు వరుసకు అన్నదమ్ములు అవుతారు.వారు ఇద్దరూ మంచి స్నేహితులు. వారు పెద్ద పెద్ద కళలు కనేవవారు . ఎప్పటికైనా కస్టపడి ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారు ఎల్లప్పుడు మాట్లాడుకునేవారు. ఇద్దరూ తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు స్వభావం కలవారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే.
ఒకానొక రోజున ఆ
అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు
చేరవేయటానికి ఇద్దరు మనుషులు ను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం విక్రం,ఆదిత్య
లకు దొరికింది.
ఇద్దరూ చెరి రెండు రెండు కడవలు తీసుకొని
నదికి వెళ్లారు. సాయంత్రమయ్యేసరికి గ్రామంలోని తొట్టిని నీటితో నింపారు. గ్రామ
పెద్ద వారిద్దరికీ కడవ కి ఒక పైసా చొప్పున చెల్లించారు.
"మన ఎంతో అదృష్ట వంతులము మన కలలు పండాయి.అని ఆదిత్యఆనందంలో అరిచాడు.
కానీ విక్రంకు అలా అనిపించలేదు. ఆ కడవలు రోజంతా మోసి అతని వీపుసాపు అయిపోయింది.
అతని చేతులకు బొగ్గాలోచ్చాయి. మర్నాడు పొద్దున్నే లేచి మళ్లీ ఆ పనికి వెళ్లాలి అనుకుంటే అతనికి భయమేసింది. గ్రామానికి నీళ్లు తీసుకురావడానికి ఇంతకంటే మంచి మార్గం ఏదైనా ఆలోచించాలని అతనునిర్ణయించు కున్నాడు.
"కలవనా? అంటే ఏమిటి?" అని ఆదిత్యఅరిచాడు. "విక్రం,
మనకుగొప్ప ఉద్యోగం దొరికింది. నేను రోజుకు 100 కడవలు చేరవేయగలను. ఒక్కొక్క కడవ కి ఒక పైసా, అంటే
రోజుకు ఒక రూపాయి! నాకు చేతి నిండా డబ్బు. ఒక వారం అయ్యేసరికి నేను కొత్త చెప్పుల జత కొనగలను. నెల తిరిగే సరికి ఒక ఆవును కూడా కొనుక్కోవచ్చు. ఆరు నెలలు
అయ్యేసరికి ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఊళ్లో ఇంతకంటే మంచి ఉద్యోగం ఎక్కడా
దొరకదు. వారం చివర రెండు రోజులు సెల వు. సంవత్సరానికి రెండు వారాలు జీతంతోబాటు సెలవు
కూడా ఇస్తారు. మనం జీవితంలో స్థిరపడి పోయాం. ఇక నీ కాలవ (పైప్ లైన్ )వ్యవహారం పక్కన పెట్టు." అని ఆదిత్య అన్నాడు.
కాని విక్రం అంత సులువుగా నిరుత్సాహ
పడలేదు. తన కాలవ ప్లాన్ తన మిత్రుడికి ఓపికగా, వివరంగా చెప్పాడు. విక్రం రోజుకు కొంత సేవు బక్కెట్లతో నీళ్లు చేరవేయాలని నిర్ణయించుకున్నాడు. మిగిలిన
సమయం, వారం చివరి రెండు రోజులు కాలవ (పైప్ లైన్ )నిర్మించటంలో వినియోగించాలని అతని పథకం. రాతినేలలో త్రవ్వటం అంటే కష్టమైన
పని అని అతనికి తెలుసు. తన జీతం కడవల లెక్కన ఇస్తారు కనుక తన సంపాదన కరిగిపోతుందని
అతనికి తెలుసు. తన కాలవ (పైప్ లైన్ )పూర్తి అయ్యాక, దానిమీద ఆదాయం రావడానికి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పట్టవచ్చు.
కానీ విక్రంకు తన కలలో నమ్మకం ఉన్నది. అతను తన పని మొదలు పెట్టాడు.
కాలవ (పైప్ లైన్ )పని మొదలు అయింది
ఆదిత్య తో కలిసి గ్రామస్తులందరూ విక్రంను హేళన చేయసాగారు. 'కాలవ వీరుడు విక్రం' అని బిరుదు కూడా తగిలించారు.
ప్రస్తుతంఆదిత్యసంపాదన విక్రం సంపాదనకు రెట్టింపు అయింది.
తను కొత్తగా సంపాదించిన వస్తువులను ఆదిత్య ప్రదర్శించ సాగాడు. అతను కొత్తగా ఒక గాడిదను కొన్నాడు.
దానికి కొత్త చర్మంతో చేసిన జీను తగిలించాడు. దానిని తన రెండంతస్తుల కుటీరం ముందర ఉంచేవాడు.
కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. భోజనశాలలో కొత్త కొత్త రుచులు కొనేవాడు. గ్రామస్తులంతా
అతనిని ఆదిత్యగారు' అని
గౌరవించ సాగారు. సారా దుకాణంలో అతను అందరికీ మందు పోయించినప్పుడు భాగ పొగిడేవారు. అతను
జోకులు వేస్తే విరగబడి నవ్వారు.
చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద ఫలితాలు
సాయంత్రాలు, వారాంతాలు ఆదిత్య ఉయ్యాల మంచంలో ఆనందిస్తూ ఉంటే విక్రం తన
కాలవ (పైప్ లైన్ ) తవ్వకం సాగించేవాడు.
మొదటి కొద్ది నెలలు విక్రం శ్రమకు తగిన ఫలితం కనిపించలేదు. అతని పని రాను రానూ కష్టతరమై పోతున్నది.ఆదిత్యపనికంటే
కష్టతరం. ఎందుకంటే విక్రం సాయంత్రాలు, వారాంతాలు కూడా
పనిచేస్తున్నాడు. "ఈనాటి త్యాగం వల్లనే రేపటి కలలు నిజం అవుతాయి." అని విక్రం అనుకునేవాడు.
విక్రం తనకుతానే మరీ మరీ చెప్పుకునేవాడు.
అతను ప్రతి రోజూ ఒక అంగుళం చొప్పున
కొనసాగించాడు. ఒక్కొక్క అంగుళం అదే అతి సులభం." అని పాడుకుంటూ విక్రం గడ్డపార ఆ రాతినేలలో దించేవాడు. అంగుళాలు అడుగుగా మారింది. అడుగు పది
అడుగులు అయింది ఆ తర్వాత 20... 100....
రోజంతా అలసిపోయి తన కుటీరానికి ఈడ్చుకుంటూ వస్తూ “తాత్కాలిక బాధ
దీర్ఘకాలిక విజయ గాధ" అని తనకు తానే నచ్చచెప్పుకుంటూ ఉండేవాడు. రోజు చేయవలసిన
పనిని నిర్ణయించుకొని ఆ పని జరిగిందా లేదా అనే దాని మీద తన విజయాన్ని బేరీజు వేస్తూ
ఉండేవాడు. కాలక్రమేణా తన శ్రమకు మించిన ఫలితం లభిస్తుంది అని అతనికి తెలుసు.
"బహుమతి మీద దృష్టి పెట్టు." నిద్రలోకి జారు కుంటూ అతను
తనకు తానే చెప్పుకునేవాడు. దూరాన గ్రామ సారాయి దుకాణం నుంచి నవ్వులు వినిపించుతూ ఉండేవి.
తారుమారైన పరిస్థితులు
రోజులు మాసాలు అయ్యాయి. ఒక నాడు విక్రం తన కాలవ (పైప్ లైన్ )సగం పూర్తి అయిందని గమనించాడు. అంటే తను కడవలు నింపడానికి సగం దూరం నడిస్తే చాలు నన్న మాట! మిగిలిన సమయాన్ని విక్రం పైప్లైన్ పనిలో వినియోగించాడు. పని పూర్తయ్యే రోజు త్వరత్వరగా దగ్గరపడుతున్నది.
పనిలో విశ్రాంతి సమయాల్లో విక్రం తన
మిత్రుడు ఆదిత్యకడవలు
మోసుకురావడం గమనించేవాడు.ఆదిత్య భుజాలు మునుపటికంటే వాలిపోయి ఉన్నాయి. భారంతో
అతని నడుము వంగి పోయింది. ఈ రోజు యాతనతో అతని అడుగులలో వేగం తగ్గిపోయింది. జీవితమంతా ఇలాగే రాత్రింబవళ్లు కడవలు మోయాలి - తన జీవితం ఇంతే అని గ్రహించిన ఆదిత్య కోపంతో చిరచిరలాడుతూ ఉండేవాడు.
అతను ఎక్కువ కాలం సారా దుకాణంలో గడిపేవాడు.ఆదిత్య రాక
గమనించిన ఖాతాదారులు “అడుగో వస్తున్నాడు, కావడి కుండల బ్రూనో.” అని గుసగుస లాడే వారు.
ఎవరైనా బాగాతాగి ఆదిత్యగూనిని,
అతని నడకను అనుకరించితే అందరూ నవ్వేవారు. ప్రస్తుతం ఆదిత్య అందరికీ సారా పోయించటం లేదు, జోకులు చెప్పడం లేదు.
ఖాళీ సీసాలు పెట్టుకొని చీకట్లో ఒకమూల కూర్చొని ఉంటాడు.
చివరికి విక్రం ఎదురు చూసిన పర్వదినం రానే
వచ్చింది. అతను తవ్వుతున్న కాలవ (పైప్ లైన్ ) పూర్తి అయ్యింది!! కాలవలో నుంచి
తొట్టిలోకి నీళ్లు దూకుతూ ఉంటే చూడటానికి గ్రామస్తులంతా చుట్టూ చేరారు. గ్రామానికి
మంచినీళ్లు నికరంగా వస్తూ ఉండటాన్ని చుట్టుపక్కల ప్రాంతాల జనం అంతా వచ్చి గ్రామంలో
నివాసం అయ్యారు. గ్రామం పెరిగి పెద్దదై సంపన్న అయింది.
కాలవ (పైప్ లైన్ ) పూర్తి అయిన తర్వాత విక్రంకు కడవలు మోయవలసిన పని తప్పింది. అతను
పనిచేసినా చేయకపోయినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అతను నిద్ర పోతున్నప్పుడు కూడా నీళ్లు
వస్తున్నాయి. వారాంతంలో అతను ఆడుకుంటున్నప్పుడు కూడా నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.
గ్రామంలోకి ఎంత ఎక్కువ నీరు ప్రవహించితే, విక్రం జేబులోకి అంత ఎక్కువ సొమ్ము
ప్రవహించేది.
“కాలవ (పైప్ లైన్ ) మనిషి విక్రం” కాస్తా ఇప్పుడు " అద్భుతాల మనిషి విక్రం”
అయ్యాడు. రాజకీయ వేత్తలు అందరూ అతని దూరదృష్టికి ప్రశంసించి అతన్ని మేయర్ గా నిలబడమన్నారు.
కానీ తాను సాధించింది పెద్ద అద్భుతం ఏమీ కాదని విక్రం గ్రహించాడు.
అతని మహాస్వప్నంలో అది మొదటి మెట్టు మాత్రమే. విక్రం మనసులో
తన గ్రామాన్ని అధిగమించిన పథకాలు ఉన్నాయి.విక్రం ప్రపంచమంతటా కాలవలు నిర్మించాలని పథకం వేశాడు.
సహాయానికి స్నేహితుడు - స్నేహితుడికి సహాయము కాలవ (పైప్ లైన్ )రావడంతో కడవలుమోసేఆదిత్య
వ్యాపారం చతికిలపడింది. సారాదుకాణంలో మందుకోసం అడుక్కుంటున్న తన స్నేహితుడిని
చూస్తే విక్రంకు బాధవేసింది. దానితో విక్రంఆదిత్యను కలిసి మాట్లాడే ఏర్పాటు చేశాడు.
"ఆదిత్య, నేను నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. ” వంగిపోయిన ఆదిత్య భుజాలు నిటారుగా అయ్యాయి. అతని కళ్ళు చికిలించి చూశాయి. “పరాచికాలు ఆడకు.” అన్నాడు ఆదిత్య కోపంగా.
"నేను నీతో పరాచకాలు ఆడటానికి ఇక్కడికి రాలేదు.” అన్నాడు.
విక్రం." నీకు ఒక వ్యాపార అవకాశం చూపటానికి వచ్చాను. నా మొదటి కలవ పూర్తి చేయటానికి రెండు సంవత్సరాలు పట్టింది.
కానీ ఈ రెండు సంవత్సరాలలో నేను చాలా నేర్చుకున్నాను. ఏ పరికరాలు ఉపయోగించాలో, ఎక్కడ
తవ్వాలో, కలవ ఎలా వేయాలో
తెలుసుకున్నాను. నేను చేస్తున్న పని నోట్స్ రాసుకున్నాను. ఒక పద్ధతి నెలకొల్పాను. ఈ
పద్ధతిన నేను మరొక కాలవ (పైప్ లైన్ ) నిర్మించగలను, ఆ తర్వాత ఇంకొకటి.. ఇంకా ఇంకొకటి...
"సంవత్సరానికి ఒక కాలవ (పైప్ లైన్ ) స్వయంగా నేనే నిర్మించ గలను. కానీ ఆ పద్ధతిన నా సమయం సద్వినియోగం కాదు.
నీకు, మరికొందరి కి ఈ కాలవ (పైప్ లైన్ ) నిర్మించే పద్ధతి నేర్పుదామని నా ఉద్దేశం... ఆ తర్వాత మీరు మరికొందరికి నేర్పవచ్చు... వాళ్లు ఇంకా
కొందరికి నేర్పవచ్చు... అలా ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ కాలవ (పైప్ లైన్ ) ఏర్పాటు అయ్యే వరకు మనం ఇలా చేస్తూ పోవచ్చు.
అప్పుడు దేశంలోని ప్రతి గ్రామంలోనూ కాలవలు నిర్మించే విషయం ఆలోచించవచ్చు. చివరికి ప్రపంచమంతటా ..ప్రతి గ్రామంలోనూ కాలవ (పైప్ లైన్ ) ఏర్పాటు చేసే మార్గం..." “ఆలోచించు.” విక్రం చెప్పసాగాడు. “మన కాలవల ద్వారా ప్రవహించే ప్రతి గాలన్
నీళ్లకు మనం కొంత శాతం కమిషన్ రాబట్టవచ్చు. మన పైపులైన్లలో ఎంత ఎక్కువ నీరు ప్రవహించితే, మన జేబుల్లోకి అంత ఎక్కువ
డబ్బు ప్రవహిస్తుంది. నేను నిర్మించిన ఈ కలవ కలకు
అంతం కాదు. అది కేవలం ఆరంభం మాత్రమే.”
బృహత్ పథకం ఆదిత్యకు ఇప్పుడు అర్థమైంది. కాయలు కాచిన తనచేతిని స్నేహితుడి చేతితో కలిపాడు.
ఇద్దరూ కరచాలనం చేసి, పాతనాటి స్నేహితులై కౌగలించుకున్నారు.
కావడి కుండల ప్రపంచంలో కాలవ (పైప్ లైన్ ) కలలు
సంవత్సరాలు గడిచాయి. విక్రం,ఆదిత్య రిటైర్ అయి చాలా కాలం అయింది. ప్రపంచవ్యాప్తం అయిన వారి
కాలవ (పైప్ లైన్ )వ్యా పారం ఇంకా వారి బ్యాంకుఅకౌంట్లలోకి కోట్లకొలది డాలర్లు పంపు చేస్తూనే ఉన్నది. గ్రామ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కుర్రవాళ్ళు
నీళ్ళ బకెట్లో మూసుకుపోవటం విక్రం,ఆదిత్య గమనిస్తారు.
ఆ చిన్ననాటి స్నేహితులు నీటి కడవలు మోస్తున్న
కుర్రాళ్లను పక్కకు పిలిచి తమ కథ చెప్పి, సొంత కాలవ (పైప్ లైన్ ) నిర్మాణంలో వారికి సాయం చేస్తామని చెప్తారు. విన్న వాళ్ళలో కొందరు కాలవ (పైప్ లైన్ ) వ్యాపారం ప్రారంభించే
అవకాశం దొరికినందుకు సంబరపడిపోతారు. కానీ అధిక శాతం కాలవ (పైప్ లైన్ ) అన్న ఆలోచనే తిరస్కరించి
తమ దారిన రాము పోతారు.
విక్రం, ఆదిత్యలు అవే సాకులు మళ్లీ మళ్లీ పదే పదే వింటూ ఉంటారు. “నాకు టైం లేదు.” "తన మిత్రుడి మిత్రుడు కలవ నిర్మించడానికి ప్రయత్నించి విఫలుడు
అయ్యాడని నా మిత్రుడు చెప్పాడు.” " మొదట్లో ప్రారంభించిన వారే అందులో డబ్బు సంపాదించగలరు.”
“నేను జీవితమంతా నిళ్లు మోస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన ఆ పనే నేను చేస్తాను.”
“ఈ కాలవ (పైప్ లైన్ ) స్కాంలో నష్టపోయిన వాళ్లు నాకు తెలుసు. నేను ఆ పని చేయను.”
ఇంతమందికి వివేచన ఇచ్చినందుకు విచారించడం మినహా విక్రం,ఆదిత్య
మరేమీ చేయలేక పోయారు.
మనము ఒక కావడి మోసే ప్రపంచంలో జీవిస్తున్నామని, ఆ దుర్గతికి చేతులెత్తేశారు.
అతి కొద్ది శాతం మాత్రమే కాలవ (పైప్ లైన్ ) గురించి కలలు కనగలరు.
నోట్: ఈ కథను the parable of the pipeline అనే పుస్తకము ఆధారంగా రూపొందించడం జరికింది. ఈ పుస్తకము మంచి పినన్సియల్ జ్ఞానాన్ని ఇస్తుంది.
0 Comments