Health Insurance complete Details in telugu

 హెల్త్ ఇన్సూరెన్స్

ఆరోగ్య భీమా (Health Insurance): చాలామంది మనం ఆరోగ్యంగా ఉన్నాము కదా మనకేమి కాదని అతి విశ్వాసంతో ఆరోగ్య భీమా తీసుకోవడం శుద్ధ దండగ అని భావిస్తారు. కానీ అనుకోని ప్రమాదాలు జరగొచ్చు. లేదా కరోనా వైరస్ లాంటి మహమ్మారుల వలన కొవిడ్-19 వ్యాధి బారినపడి ఆసుపత్రుల పాలైనపుడు మాత్రమే ఆరోగ్య భీమా ప్రాధాన్యత గుర్తిస్తాము. ఇలాంటి సందర్భాలలో వైద్యము కోసం ఉన్న సేవింగ్స్ ఖర్చు చేయడం, ఆ డబ్బులు కూడా సరిపోక అప్పులు చేయడం చేస్తుంటారు. ఆస్తులు అమ్ముకోవడంచేస్తుంటాం.కరోనా వైరస్ పాండమిక్ సమయంలో అయితే అనేకమంది వైద్యం కోసం ఆస్తులను  కూడా అమ్ముకుని ఆసుపత్రుల బిల్లులు చెల్లించారు. మీ ఆదాయం, కుటుంబ సభ్యుల సంఖ్య, వయసు ఆధారంగా కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా తప్పని సరిగా ఆరోగ్య  భీమా తీసుకోమని సలహా. ఇది మీరు అనారోగ్యానికి గురైనప్పుడు పొదుపు వ్యాపారం చేసిన డబ్బు కోల్పోకుండా, అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా కాపాడుతుంది. మీ వయసు పెరుగుతున్న కొద్ది ఆరోగ్య భీమా పాలసి మొత్తాన్ని కూడా పెంచుకుంటూ ఖర్చుల పోవాలని గుర్తుంచండి.

Health insurance తీసుకొనే ముందు మనము తెలుసుకోవలసిన విజయాల గురించి నేర్చుకుందాం.

1)ఏ ఏజ్ లో health insurance తీసుకోవాలి.

డబ్బులు సంపాదించడం మొదలుపెట్టగానే తీసుకోవాలి. యంగ్ ఏజ్ లో health insurance తీసుకోవడం వల్ల ఆ సమయంలో ఎలాంటి అనారోగ్యం వుండదు కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు సులభంగా ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయి.మరియు చిన్న వయస్సులో ఇన్సూరెన్స్ తీసుకొని ప్రతి సంత్సరం ప్రీమియం కడుతూ use చేయకపోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపనిలు no claim bonus ను యిస్తాయి.ఇది ఇది 2రకాలుగా వుండవచ్చు

i ) ప్రీమియం తగ్గవచ్చు

ii ) ఇన్సూరెన్స్ పీరియడ్ పెరగవచ్చు.

ఉదా : మీరు 1year కి గాను 5లక్షల health insurance తీసుకొని వుంటే  ఆ సంవ్సరమంతా క్లైమ్ చేయనట్లయిటే మీకు నెక్స్ట్ year premium తగ్గించడం లేదా ప్లాన్ amount 5లక్షలకు బదులు 5.5లక్షలు చేయడమో చేస్తారు.



2)ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవాలా? Individual ga తీసుకోవాలా?

చాలామంది జాబులో జాయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కానీ వారికి పేరెంట్స్,భార్య  పిల్లలు ఉన్నట్లయితే! ఎక్కువ ఏజ్ వున్న పేరెంట్స్ కి సపరేట్ గా తక్కువ ఏజ్ వున్న మీకు మీ భార్య పిల్లలకు కలిపి తీసుకోండి.50year కంటే ఎక్కువ ఉన్నవాళ్ళని కలిపితే ఎక్కువ ప్రీమియం కట్టవలసి వస్తుంది.పెద్దవాళ్లకు సపరేట్ గా తీసుకోవడం బెటర్.

    3)     ఎంత కవరేజ్ వున్న ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

             2లాక్ , 5లాక్,10లాక్ ఇలా కవరేజ్ వుంటాయి కాని మనము ఎంత కవరేజ్ తీసుకోవాలనేది మన income  ఆధార పడి ఉంటుంది.అలాగే మీ ఏజ్ మీద ఆధారపడి వుంటుంది.ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్లకు కొంచం రిస్క్ ఎక్కువ కాబట్టి ఎక్కువ కవరేజ్ ఆలోచించాలి అలాగే income ఎక్కువ వుంటే మీఇష్టం ఎంత అయినా తీసుకోవచ్చు.అలాగే మీ జీవన విధానము మీద కూడా కవారేజ్ అనేది ఆధారపడి వుంటుంది.బెస్ case 5lakh.

ఇన్సూరెన్స్ తీసుకునే ముందు గమనించాల్సిన అంశాలు.

ఇన్సూరెన్స్ కంపెనీ యెక్క హాస్పిటల్ నెట్వర్క్ ఏవిధంగా వుంది?మనము నివసించే పట్టణములో ఆ కంపెనీ టయాప్ అయిందా లేదా తెలుసుకోవాలి.మనము వెళ్ళే హాస్పిటల్లో  ఆ కంపెనీ ఇన్సూరెన్స్ వుందా లేదా చూసుకోవాలి.మనం హాస్పిటల్ కి వెళ్ళిన తరువాత డబ్బులు మనము పే చేయకుండా క్యాష్ లెష్ ట్రీట్మెంట్ వుండేలా చూసుకోవాలి. Restoration benifit అంటే ఉదా :ముందుగా మనము హాస్పిటల్ కి వెళ్లి నపుడు 5లక్షల పాలసీ లో 3లాక్ కర్చు అయిన కొంత కాలానికి మళ్ళీ 5lakh  గా మారాలి ఆ year lo remaining 2లాక్స్ claim మాత్రమే చేసే పాలసీ తీసుకోకూడదు.

No Room rent limit

కొన్ని పాలసీలు room రెంట్ లిమిట్ ఉంటాయి. అలా వుండకుండా కంప్లీట్ గా కంపెనీ భరించెలా వుండాలి. అలాగే sublimit వుండకుండా చూసుకోవాలి.సబ్ లిమిట్ అంటే కొన్ని వ్యాధులకు కొంత లిమిట్ మాత్రమే వుంటుంది.ఎలాగంటే హెర్నియా కి 50వేలు మాత్రమే పే చేస్తాం మిగతాది పేషన్టు పే చేయాలి అని వుంటుంది వీలైనంత వరకు సబ్లిమిట్ లేకుండా వుండాలి.


Cooling period

మనము పాలసీ తీసుకున్న మరుసటి రోజే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోలేము.చాలా కంపెనీలు మినిమం 30days వెయిటింగ్ పీరియడ్ వుంచుతాయి.సడన్ ఏక్సిడెంట్ మినహాయిస్తే నెమ్మదిగా పెరిగే వ్యాధులకు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ వుంటుంది.మీరు వీలైనంత తక్కువ వెయిటింగ్ పీరియడ్ వున్న పాలసీ తీసుకోండి. చిన్న ఏజ్ లో పాలసీ తీసుకోవడం వల్ల వెయిటింగ్ పీరియడ్ ప్రభావము మనపై అంతగా వుండదు.ఎందుకంటే ఆ అజెలో పెద్దగా వ్యాధులు ఉండవు.

Pre - post hospital expenses

మనకు ఏ వ్యాధి సోకిన వెంటనే హాస్పిటల్ లో డైరెక్ట్ గా జాయిన్ కలేము.ముందుగా టెస్ట్స్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయ్యాక జాయిన్ అవుతాము .అలాగే ట్రీట్మెంట్ తర్వాత కూడా హాస్పిటల్స్ కి వెళ్లి చెకప్ చేసుకోవలసి వస్తుంది.యిలాంటి కర్చులు కూడా హాస్పిటల్ భరించేలా వున్న పాలసీ తీసుకోవాలి.

Day care

కొన్ని ఆపరేషన్స్ ఒక్కరోజులోనే అవుతుంటాయి.అలాంటి వాటిని కూడా కవర్ చేసే పాలసీ తీసుకోవాలి.కొన్ని eye ఆపరేషన్స్ ఒకరోజులోనే అయిపోతాయి.యిలాంటి ఒకే రోజులో జాయినింగ్ మరియు డిచార్జ్ అయ్యే వాటిని కూడా కవర్ చేయాలి.



Co -pay

కొన్ని పాలసీలు కో -pay ఆప్షన్ వుంటుంది అంటే co -pay 10% అని వుంటే మొత్తం ట్రీట్మెంట్ కర్చులో 10% మనము పే చేయాలని అర్థం.మనము ఇన్సూరెన్స్ తీసుకునేది మన పాకెట్ నుండి ఖర్చు పెట్టకూడదని అలాంటప్పుడు co -pay వుండకుండా లేని పాలసీ ప్రెపర్ చేయండి.

Free medical checkup

కొన్ని పాలసీలు ఫ్రీ మెడికల్ చెకప్ లను అనుమతిస్తాయి.ఎలాంటి పాలసీ అయితే బెటర్.

మనము హాస్పిటల్ లో జాయిన్ అయిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ కి తెలియజేయాలి.వీలైనంత వరకు మనము ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకుంటామో ఆ సిటీ ని కవర్ చేసే పాలసీ తీసుకోవాలి.మనకు సిగరెట్,మద్యం మేదలగు అలవాట్లను పాలసీకి ముందే కంపెనీకి తెలియచేయాలి. ఇంకేమైన ఆపరేషన్స్ అయివుంటే అవి కూడా తెలియచేయాలి.ట్రీట్మెంట్ మధ్యలో ఇలాంటివి తెలిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ రిజెక్ట్ చేయవచ్చు.ముందే మనకేమైన వ్యాధులున్న కంపెనీకి తెలుపాలి.

ఏదైనా ఉద్యోగి తనకు తాను పనిచేసే కంపెనీ ఇన్సూరెన్స్ యిస్తే ఉద్యోగము పోయిన,రిటైర్మెంట్  అయిన ఆ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ను పర్సనల్ ఇన్సూరెన్స్ గా మార్చుకోవచ్చు.ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము ఇచ్చే health insurance చాలా తక్కువగా వుంటుంది.కాబట్టి additional గా పాలసీ తీసుకోవచ్చు. 95% క్లైమ్ ratio వున్న పాలసీ తీసుకోవాలి.



మను online lo పాలసీ తీసుకోవచ్చు అందుకు గాను policy bazar అనే website ద్వారా పాలసీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు.policybazar వారు మనకు call చేసి కూడా guide చేస్తారు.

Policy తికోవాలనుకునే వారు ఈ లింక్ వాడండి for website link CLICK HERE


Post a Comment

0 Comments