The Negative Effects of Smartphones on Mental Health & Well-Being

The Negative Effects of Smartphones on Mental Health & Well-Being



 మొబైల్ ఈ కాలంలో మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుతున్నారు.ఈ మొబైల్స్ వల్ల ఎవరెవరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలుసుకుందాం.

1. తల్లిదండ్రులు,పిల్లల మధ్య
2. భార్య భర్తల మధ్య
3.ఉపాధ్యాయులు,విద్యార్థి మధ్య
4.స్నేహితులు  

పై 4 సందర్బాలలో మొబైల్ వాళ్ళ లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

1. తల్లిదండ్రులు,పిల్లల మధ్య

కొన్ని సంవత్సరాల కింద తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కొంత సమయమైనా పిల్లలతో గడిపేవారు.రాత్రి సమయంలో పిల్లలకి కథలు చెప్పేవారు.పిల్లల్ని ప్రేమతో దగ్గరికి తీసుకునేవారు.వాళ్ళ మంచి చెడులు దగ్గరుండి చూసుకునేవారు.



కానీ ఈ కాలంలో  అన్ని కరువయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమ అందిస్తున్నారు కానీ ఒకప్పటి ప్రేమతో పోలిస్తే ఇపుడు చూపించే ప్రేమలు తక్కువే అని చెప్పుకోవాలి.అందుకు కారణం మొబైల్. తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్లి వస్తారు అలిసిపోయాము అంటూ పిల్లల్ని దూరం పెడతారు.సరే అలిసిపోయారు.కాసేపు ప్రశాంతంగా నిద్ర అయినా పోయి అలసట తీర్చుకుంటారా ,అంటే అదీ లేదు.పడుకొని మొబైల్ చూస్తుంటారు.తర్వాత లేచి ఇంట్లో పనులు చేసుకుంటారు.కనీసం పిల్లలకి తినిపించేటపుడు అయిన మాట్లాడుతూ బయట తిప్పుతూ తినిపిస్తారా అంటే అదీ లేదు.ఫోన్ లో బొమ్మలు పెట్టడం,పిల్లల ముందు పెట్టడం తినిపించడం. పిల్లలు పడుకునే సమయంలో కూడా ఫోన్ చూస్తూనే నిద్రపోతున్నారు.ఇలా అయితే పిల్లల ఆరోగ్యం ఏమైపోతుందో అనే ఆలోచనే ఉండటం లేదు.ఇంట్లో పనులు చేసుకునేటపుడు కూడా పిల్లలు చేసుకొనివ్వరని ఫోన్ పిల్లల ముందు పెట్టి పనులు చేసుకుంటున్నారు.ఇలా అయితే పిల్లలతో సమయం గడిపేది ఎపుడు,వాళ్లకు ప్రేమ అందించేది ఎపుడు? తల్లిదండ్రులు పిల్లలని ఇలా పెంచితే పిల్లలు ఎలా పెరుగుతారు,రేపు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారా, ఇపుడు మన పెంపకం ఎలా ఉంటుందో రేపు మనల్ని వాళ్ళు చూసుకునే విధానం అలా ఉంటుంది.ఇలాంటి తల్లిదండ్రుల కోసమే వృద్దాశ్రమాలు అవసరం అవుతాయి.ఒకప్పుడు ప్రేమతో పెంచిన తల్లిదండ్రులనే ఈ కాలం లో పిల్లలు వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు.అలాంటిది ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలని ఫోన్ తో పెంచితే రేపు ఎలా ఉంటుందో ఊహించుకోండి.



కొందరు అయితే మరీ ఘోరం పిల్లలు ఏదైనా కావాలని అడుగుతున్న పట్టించుకోకుండా మొబైల్ చూస్తూనే ఉంటారు అడిగి అడిగి ఆ పిల్లలే సైలెంట్ అయిపోతారు. 

 2. భార్య భర్తల మధ్య:

ఈ ఇద్దరి మధ్య మొబైల్ డామినేషన్ ఎంతలా ఉందంటే ఇక మాటల్లో చెప్పలేను.ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య గొడవలకు ముఖ్య కారణం మొబైల్ అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ కంటే ఫోన్ పైన ప్రేమే ఎక్కువై పోయింది.ఒకప్పుడు కుటుంబ విషయాలు కష్ట, సుఖాలు ఏమున్న ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు,కానీ ఇపుడు ఆ టైమే ఉండటం లేదు, అందుకు కారణం మొబైల్. ఏ భార్య అయిన భర్త నుంచి ఎక్కువగా ఆశించేది తనతో కాసేపైనా ప్రేమగా మాట్లాడాలి,ఒకరి కష్ట,సుఖాలు ఒకరు పంచుకోవాలి అని,ఇలాంటి భర్తలు ఈ కాలంలో చాలా అరుదు.పగలంతా పనులు చేసుకుని వచ్చిన భర్తను ఏ భార్య ఇబ్బంది పెట్టాలనుకోదు.కానీ కాసేపైనా తనతో మాట్లాడాలి అనుకుంటుంది.కానీ మాత్రం ఫోన్ తో గడుపుతారు,భార్యలను పట్టించుకోవట్లేదు. భార్యలు కూడా ఫోన్ తో గడిపే వాళ్లు ఉంటారు.కానీ ఇద్దరితో పోల్చుకుంటే మగవారే ఫోన్ తో  ఎక్కువ సమయం గడుపుతున్నారు.దీని వల్ల భార్య భర్తల మధ్య గొడవలు చాలానే జరుగుతున్నాయి.ఎంతో మంది భార్యలు చాలా బాధ పడుతున్నారు.తమ భర్త ప్రేమ తమ కంటే ఫోనే ఎక్కువ పొందుతుంది అని.ఈ బాధ చాలా మంది భార్యలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని భార్యాభర్తలు ఫోన్ అవసరానికి మించి వాడకుండా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం మంచిది.

 3. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య:

ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య బాండింగ్ ఎంత ఎక్కువ ఉంటే విద్యార్థి అంత తొందరగా  జ్ఞానాన్ని పొందగలుగుతాడు.ఒకప్పటి విద్య అవగాహనతో కూ డినదిగా ఉండేది.కానీ ఇపుడు అంతా బట్టీ పట్టడమే ఏ విషయమైనా గైడ్ ఉపయోగించడం చూసి రాయడం,ఇదే జరుగుతుంది.ఇపుడు ఏది చదివినా ఉన్నది మాత్రమే నేర్చుకోవడం,ఆ విషయం గురించిన పూర్తి జ్ఞానం పిల్లలలో ఉండటం లేదు.దానికి తోడు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు.ఫోన్లో చూసి రాయండి అని చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ లో అయితే మరీ ఎక్కువగా ప్రతి చిన్న విషయం గూగుల్ లో వెతకడం రాయడం.ఇలా అయితే పిల్లలు ఏమై పోతారు,వారి చదువు ఏమై పోతుంది.ఒకప్పుడు ఉపాధ్యాయులు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి రాసుకురమ్మంటే , సీనియర్స్ నీ అడగటం,పెద్దవాళ్ళ నీ అడగటం లేదా లైబ్రరీ కి వెళ్లి మరీ వెతికి రాసేవాళ్ళము.ఆ చదువులు ఇపుడు ఏమైపోతున్నయి? ఆన్లైన్ క్లాసెస్ అంటూ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం,దీని వల్ల ఎన్ని జరిగాయో చాలానే చూసాము.కాబట్టి పిల్లలకి ఫోన్లలో చదువు కాకుండా ఏదైనా సరే వారి మెదడుకు పని చెప్పి వారి మేధా శక్తి పెంచే విద్యను ఉపాధ్యాయులు అందించాలని మనవి.

4.స్నేహితుల మధ్య;

ఒకప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడాలంటే ఒక date అనుకుని అందరూ ఒక దగ్గర కలుసుకుని,చేతులు కలుపుకోవడం,కౌగిలించుకోవడం చేసేవాళ్ళు.ఇలా చేయడం వల్ల friendship, అయిన ప్రేమ అయిన పెరుగుతుందట.వాళ్ళ మధ్య బాండింగ్ ఎక్కువవుతుంది.కానీ ఇపుడు ఫోన్లో మాట్లాడడం,చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసుకోవడం.అదే ఫోన్ లేకపోతే అందరూ ఒక చోట కలుసుకుని అందరి కష్ట,సుఖాలు పంచుకుంటూ మాట్లాడుకుంటే ఆ సంతోషమే వేరు.కాబట్టి అపుడపుడు ఫ్రెండ్స్ ,బంధువులతో నేరుగా కలిసి గడపండి అది కూడా ఫోన్లు పక్కన పెట్టేసి.

పై విషయాలు దృష్టిలో ఉంచుకుని,ఏదైనా అవసరానికి మించి వాడితే అనార్దాలే.  ఫోన్  అవసరం కాబట్టి అవసరానికి మాత్రమే వాడండి,ఫోన్ల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అంత వరకు ఉపయోగిస్తేనే మంచిది,కానీ ఈ కాలం వాడకం ఎన్నో అనర్థాలకు,ఇంట్లో ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి.కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వాడండి.18 below age పిల్లలకు ఫోన్ ఇవ్వకపోవడం మంచిది.


Post a Comment

0 Comments