Rich
Dad Poor Dad
డబ్బు కోసం
నివు పనిచేయవాలిన అవసరం లేదు ..ఆ డబ్బే నీకొరకు పనిచేసేలా మార్చుకో -రాబర్ట్
కియోసకి
Rich Dad Poor Dad : రాబర్ట్ కియోసకి ఇద్దరు
తండ్రులమద్య పెరిగాడు. ఆ ఇద్దరి తండ్రుల్లో ఒకరు పేదవారు, ఒకరు ధనవంతులు. ఒకాయన పెద్ద చదువులు చదివిన విజ్ఞాన వంతుడు. ఆయన నాలుగేళ్లలో
పూర్తి చేయాల్సిన గ్రాడుయేషన్ను రెండేళ్లలో పూర్తి చేశాడు. ధనవంతుడైన రెండో
తండ్రి కేవలం 8వ తరగతి కూడాచదవలేదు. ఇద్దరూ వారి వారి
వృత్తుల్లో చాలాపేరుపొందిన వారు. పేదతండ్రి మాత్రం డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. సంపన్న
తండ్రి హవాయిలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు.(ఇక్కడ
పేద తండ్రి సొంత తండ్రి, సంపన్న తండ్రి తన మిత్రుని తండ్రి.)
సంపన్న తండ్రి సంపాదించిన డబ్బును కుటుంబ సభ్యులకు, దేవాలయాలకు,
సేవా కార్యక్రమాలకు, కరెన్సీ రూపంలో ఇచ్చి
చనిపోయాడు.పెదతండ్రి మాత్రం తన జీవితంలో తన అవసరాలకు చేసిన అప్పులను కూడా తీర్చ లేకపోయాడు. వాస్తవానికి
ఇద్దరూ చాలా సమర్థులే. ఎదుట వారిని ఆకట్టుకునే మంచితనం వారిలో ఉంది.ఇద్దరికి చదువంటే మక్కువ ఎక్కువ. కానీ వారు రాబర్ట్ కియోసకికి చదువు గురించి చెప్పిన పద్ధతుల్లో మాత్రం
చాలా తేడా ఉండేది.కాని రిచ్ డాడ్
ముందునుండే సంపన్నుడు కాదు. పూర్ డాడ్
కూడా ముందునుండే పేదవాడు కాదు. వారి వృత్తుల్లో వారు చాలా కష్టపడ్డారు, కానీ డబ్బు విషయంలో మాత్రం
వారి ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉండేవి. ఇద్దరిలో ఒకరు ఇలా డబ్బు అనేది
పాపిష్టిది అన్ని సమస్యలకు డబ్బే కారణం అని ఒకరు అంటారు. ఇంకొకరు డబ్బే
అన్నిటికంటే గొప్పది అన్ని సమస్యలని డబ్బు
తిర్చగలదు అంటారు.
నిజానికి ధనవంతులు యింకా ధనవంతులు కావడానికి, పేదవారు ఇంకా పేదవారుగా కావడానికి డబ్బును సంపాదించడం ఎలానో తెలియకపోవడమే?. నిజానికి
స్చూల్లలో డబ్బు సంపాదించడం గురించి నేర్పారు. అది మన పేరెంట్స్ చెబితేనే తెలుస్తుంది. ముఖ్యంగా సంపన్నుల పేరెంట్స్ వారి పిల్లలకు అన్ని విషయాలను చెబుతారు. డబ్బు
ఎలా సంపాదించాలి? సంపాదించిన దానిని ఎలామదుపు చేయాలి? డబ్బును డబ్బుతో
ఎలా సృష్టించాలి అనేవి వారి పిల్లలతో నేర్పిస్తారు.
కానీ పేద తపేరెంట్స్ మాత్రం వారి పిల్లలకు ఏం చెబుతారు. కేవలం ప్రతిరోజూ
స్కూలుకు వెళ్లి బాగా చదువుకో.మంచి వుద్యోగం తెచ్చుకో మంచి జీతం వుండే పనిలో చేరు
అని ,ధనవంతులను యింక ధనవంతులను చేసే పనులు చేయమంటారు.
పిల్లలకు స్కూల్లో, కాలేజీలో డబ్బు
గురించి ఎటువంటి జ్ఞానం ఇవ్వరు. స్కూల్లో
కానీ, ఎంత మెరిట్ తో పాసై మంచి జీతం గల వుద్యోగ0 చేస్తున్నా జీవితాంతం డబ్బు
గురించి మనంమదనపడుతూనే ఉంటాం. రాబర్ట్
కియోసకి కి ఇద్దరు
తండ్రులు ఉండటం వల్ల ప్రతి సారి రెండు కొనాల్లో విషయాలను తెలుసుకున్నాడు.
ఇద్దరి తండ్రుల్లో ఒకరు నేను సాధించలేను అంటే, ఇంకొకతను
నేను దానినిసాధించ గలను అనేవారు.
ఎప్పుడైతే మనం సాధించ లేము అని భావిస్తామో
అప్పుడే మన బుర్ర పనిచేయడం
మానేస్తుంది. కానీ ఎలా దానికని సాధించాలి?
అనే ప్రశ్న వేసుకుంటే ఎలాగైనా దానిని సాధించాలనే తపన బుర్రలో మొదలవుతుంది. అంటే దీని ఉద్ధేశ్యం ఏదైనా సాదించాలి
అనేది కాదు. ఎలా? అనే
ప్రశ్న మనలో మొదలైతే ఏ పని అయిన సాధ్యమవుతుందని దీని భావం.
ఈ కథలో
లో ఇద్దరు తండ్రులు ఎంతో కష్టపడి శ్రమించినప్పటికీ వారిలో ఒకాయన డబ్బు విషయంలో
తన బుర్రను ఉపయోగించుకోలేక పోయాడు. రెండో అతను డబ్బు సంపాదించేందుకు మంచి
ఆలోచనల కోసం బుర్రను ఎప్పటికప్పుడు తట్టి మేల్కొలిపేవాడు. దీని ఫలితంగా
ఆర్థికంగా ఒకాయన బలపడితే, రెండో
అతను కృంగిపోయేవాడు. రోజూ శ్రమించి వ్యాయమం చేసే వ్యక్తి మరియు ఎటువంటి వ్యాయామం లేకుండా ఖాలిగా టివి ముందు
కూర్చుని కాలం గడిపే వ్యక్తి కి మధ్య ఉన్న తేడాయే మెదడు విషయంలో కూడా
ఉంటుంది. శారీరక వ్యాయామం మనల్ని
ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. మెదడుకు కలిగంచే వ్యాయామం మనల్ని ఎలా ఆలోచించాలో
తెలుపుతుంది.
ఒకతను
కష్టపడిభాగ చదువుకుంటే మంచివుద్యోగం వస్తుందని అనుకుంటే, రెండో అతను కష్టపడి చదువుకుంటేనే ఏదైనా
మంచికంపెనీని నువ్వు కొనగల, స్తాపించగల అవకాశం వస్తుందని అంటాడు. ఒకతను
వారి పిల్లలకు భోజనం చేసేటప్పుడు డబ్బు గూర్చి , వ్యాపారం
గూర్చి చెబితే, రెండో అతను తన పిల్లలతో తినేటప్పుడు దానం
గురించి మాట్లాడకూడదని అంటాడు. పేద
తండ్రి.నేను ఎప్పటికీ ధనవంతుడుని కాలేనని అంటుండేవాడు. అందుకనే ఆయన ధనవంతుడు
కాలేకపోయాడు. మరో పక్క సంపన్న తండ్రి ఎప్పుడూ నేను ధనవంతుడునే అని నమ్మేవాడు.
తన వ్యాపారంలో నష్టం జరిగి సంపద అంతా పోయినా, తను మాత్రం
ఎప్పుడూ ధనవంతుడనే అనేవాడు.
నిజానికి
మన ఆలోచనలే మన జీవితాలను రూపుదిద్దుతాయి. ఈ స్టోరీలో ఇద్దరుతండ్రులకు
చదవు అంటే చాలా గౌరవం. కానీ పూర్ డాడీ మాత్రం తన కొడుకైన రాబర్ట్‌ను బాగా చదువుకో,బాగా సంపాదించు. అప్పుడే సంతోషంగా
ఉండగలవు. అని చెబుతుండేవాడు. రిచ్ డాడ్ మాత్రం డబ్బు సంపాదించడానికి పనికి వచ్చే
చదువు మాత్రమే చదువు అని చెబుతుండేవాడు. డబ్బు ఎలా పనిచేస్తుందో ముందుగా
తెలుసుకోవాలి. డబ్బు కోసం మనం పనిచేయకూడదు. డబ్బే మన కోసం పనిచేయాలి అని
అంటాడు రిచ్ డాడ్.
తన 10
ఏళ్ల లోపే రచయిత రాబర్ట్ రిచ్‌డాడ్, పూర్ డాడ్ వద్ద నుండి డబ్బుకు సంబంధించిన విషయాలను
అన్నీ తెలుసుకున్నాడు. డబ్బు ఒకరమైన శక్తి, ప్రతి
వ్యక్తికి సంపన్నుడు కావాలని ఉంటుంది. ఈ కోరిక మనలోనూ ఉంటుంది. కానీ,అన్నిటికన్నా
కన్నా శక్తివంతమైనది జ్ఞానం. డబ్బు వరావడం పోవడం సహజం . కానీ డబ్బు ఏం
చేస్తుందో డబ్బు యెక్క స్వభావమును మనం
తెలుసుకోగలిగితే దానిని మన ఆధీనంలోకి తీసుకొని సంపంనులము కావొచ్చు. దాదాపు అందరికీ తెలివి,జ్ఞానము ఉన్నా, మంచి చదువులు చదివినప్పటికీ
ధనవంతులు కాకపోవడానికి కారణం డబ్బు కోసం పనిచేయడమే. జీవితాంతం అంటే డబ్బు
కోసం పరుగులుతీయడమే. నిజానికి సంపన్నులు డబ్బు కోసం పనిచేయరు. డబ్బే వాళ్ల
కోసం పనిచేస్తుంది. అది ఎలా అంటే? రచయిత రాబర్ట్ వాటిని 4 రకాలుగా చెప్పాడు.
1.
వ్యాపారము
2.
ఇన్వెస్ట్మెంట్
3.
ఎంప్లాయిమెంట్
4.
సెల్ఫ్
ఎంప్లాయిమెంట్.
పైన
పేర్కొన్న వాటిలో ఎక్కువుగా కష్టపడేది ఉద్యోగులుt
మాత్రమే. ఈ ఉద్యోగులు ఏదో ఒక కంపెనీలోనో, ఆఫీసులోనో
ఎవరికిందో డబ్బు కోసం పనిచేస్తుంటారు. ఇక చిన్న వ్యాపారులు మాత్రం ఏదైనా చిన్న
సొంత వ్యాపారం పెట్టి అందులో స్థిరపడతారు. తర్వాత వ్యాపారస్తులు అంటే బాగా
పెట్టుబడి పెట్టి, అందులో ఉద్యోగులను పెట్టుకొని ఒక కంపెనీని నడుపుతుంటాడు. వాళ్లకు
నెలకు వేతనాలు ఇస్తూ, వాళ్ళతో పనిచేయించుకుండాడు. ఇక మదుపు చేసే వారు ఎలా ఉంటారంటే ? ఏదైనా పెద్ద కంపెనీలో కొంత వాటాలను కొని చేసి దానితో వారు లాభాలు తీసుకుంటారు.
మదుపు చేసే వారికి ఎలాంటి ఉద్యోగమూ అవసరం ఉండదు. వారికి ఎటువంటి నష్టభయము ఉండదు.
అలా వారు డబ్బు సంపాదించుకుంటారు. పైన తెలిపిన నాలుగు రకాల మనుషులనుగమనిస్తే మనకు
ఇప్పటికే అర్థమై ఉంటుంది. జీవితంలో ఎక్కువగా కష్టపడేది ఉద్యోగులు మాత్రమే.
వీరు నెలకు వచ్చే చిన్న జీతం కోసం పనిచేస్తూ ఉంటారు. వారి ఖర్చులు పెరుగుతున్న
కొద్దీ వారిజీతభత్యాలు మాత్రం ఏమాత్రమూ పెరగవు. అలా డబ్బు కోసం కంపెనీలను మారుస్తూ
జీవితంలో టైం అంతా వృధాచేసుకుంటూ వుంటారు. అలా తన 60 సంవత్సరాల
జీవితంలో ఏమీ సంపాదిన్చుకోకుండానే కాలం గడిచిపోతుంది.
సంపన్న
తండ్రి అభిప్రాయం ఏమంటే ఉద్యోగం చేయడం వల్ల
జీవితం ఏమీ మారదు. జీవితం గడుస్తుంది మాత్రమే. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఎటువంటి
రిస్క్ చేయకుండా, ఎవరిపైనా
ఆధారపడకుండా జీవిస్తారు. వ్యాపారస్తులు, మదుపరులు మాత్రం
బాగా డబ్బులు సంపాదించి ధనవంతులు అవుతున్నారు. అందుకేసంపన్నులు ఇంకా సంపన్నులు
అవుతున్నారు. పేదవారు ఇంకా పేదవారు అవుతున్నారు. ఇలాంటి డబ్బు గురించి స్కూల్లో
కానీ, కాలేజీలో కానీ చెప్పరు. అందుకే మనం సమాజంలోకి వచ్చినప్పుడు
డబ్బు గురించి చాలా కస్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటి గురించి అవగాహన వచ్చే లోపే మన
జీవితం సంగం గడుస్తుంది. ఇప్పుడు తెలుసుకున్నా పెద్దగ ప్రయోజనం వుండదు , రిచ్ డాడ్ – పూర్ డాడ్
ఇద్దరు తండ్రులకు రాబర్ట్ కు ఉండటం వల్ల తన చిన్న తనం లోనే అన్నీ
తెలుసుకున్నాడు. తన జీవితంలో 39
సంవత్సరాలకే సంపన్నులలో ఒకరుగా మారాడు.
అతి తక్కువ సమయంలోనే రిటైర్డ్ అయ్యాడు.
సిరిదా
వచ్చిన వచ్చును
సలిలతముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదాఁబోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరిణిని సుమతీ
పై పద్యము లాగా దానం ఎలా వస్తుందో
ఎలపోతుందో తెలువదు కాని దాని స్వభావాని తెలుసు కొని వ్యవహరిస్తే మనం కూడా
సంపంన్నులము కావచ్చు.
మీరు కూడా తక్కువ కాలములో సంపన్నులు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకము కావాలంటే యిక్కడ
నొక్కండి
0 Comments