Importance of Teaching Children the Value of Money

పిల్లలకు డబ్బు విలువ తెలియజేయడం ఎలా?



ఈ కాలం పిల్లలకు డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప,డబ్బును ఎలా ఆదా చేయాలి?ఎలా పొదుపు చేయాలి? ఇప్పుడు ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్ లో వచ్చే నష్టం ఏమిటి?కష్టాలు ఏమిటి? అనేవి ఈ కాలం పిల్లలకు తెలియదు.కాబట్టి వారు ఎంతసేపు డబ్బులు కావాలనే అడుగుతారు తప్ప ఆ డబ్బు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రుల కష్టం వారికి తెలియదు.కాబట్టి పిల్లలు ఆ విధంగా ఉండకుండా డబ్బును పొదుపుగా వాడడం ఎలా?పొదుపు చేయడం ఎలా? తెలుసుకుందాం.



పిల్లలు ఇలాంటి తప్పులు చేస్తున్నారంటే అందుకు కారణం తల్లిదండ్రులే.వాళ్ళను మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు కానీ వాళ్ళంతట వాళ్లు ఏమి నేర్చుకోరు కదా? కొందరు పిల్లలు అయితే మరీ మొండిగా ఉంటారు డబ్బులు లేవు అంటే నువేం చేస్తవో నాకు అనవసరం నాకు మాత్రం ఈ టైం కి ఇంత డబ్బు కావాలి.అని టైం చెప్పి వెళ్తారు.ఆ టైం వరకు డబ్బు రెడీ అవకపోతే పెద్ద గొడవ చేస్తారు మీకెందుకు పుట్టానో నేను డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టాల్సింది. అని తల్లిదండ్రులను విసుక్కుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు.అపుడు తల్లిదండ్రులు ఏడుస్తూ  కూర్చుంటారు.ఇలాంటి పరిస్థితులు రాకూడదు అంటే మనమే పిల్లలను పెంచే విధానం మార్చుకోవాలి.ఎన్నో న్యూస్ కూడా చూస్తున్నాం డబ్బు కోసం ఆస్తుల కోసం కన్నవారిని చంపేస్తున్నారు.చివరికి వచ్చే 2000 పెన్షన్ కోసం కూడా చంపేస్తున్నారు. కాబట్టి పిల్లలకు ఏం నేర్పించాలి? ఎలా నేర్పించాలి చూద్దాం. 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు పొదుపు చేయడం ఎలా నేర్పించాలి.

ఈ వయసు పిల్లలకు డబ్బులు సంపాదించిన గొప్ప వాళ్ళ గురించి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు.కాబట్టి మనమే నేర్పించాలి.

ఈ వయసు పిల్లలకు ఒక కిడ్డి బ్యాంక్ 🏦 కొనియ్యాలి. వాటిలో మొదట వారినే ఒక 10 రూ. వేయమని చెప్పాలి. అలా అపుడపుడు వారితో వేపిస్తునే ఉండాలి.వారితో పాటు మీరు కూడా వాళ్ళకి తెలియకుండా వేస్తూ.కొన్ని రోజుల తర్వాత పిల్లల ముందే ఆ బ్యాంక్ ను ఓపెన్ చేసి డబ్బులు తీసి వారికి ఇష్టమైనది కొని ఇప్పిం చాలి. అపుడు వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేం.ఇలా చేస్తూ చేస్తూ పోతే పిల్లలు ఖచ్చితంగా  సేవింగ్స్ చేయడం మొదలు పెడతారు.

ఈ కాలం పిల్లలు పని చేయడానికి ఇష్టపడరు.కాబట్టి ఇలా చేస్తూనే పిల్లలకు పని కూడా నేర్పించవచ్చు.ఎలా అంటారా.చిన్న చిన్న పనులు చెప్తూ నువ్ ఈ పని చేస్తే నీకు ఇన్ని డబ్బులు ఇస్తా.అని చెప్పాలి.అపుడు ఆ పని చేసి ఇచ్చిన డబ్బులు కిడ్డీ బ్యాంక్ లో వేసుకుంటారు.ఇలా చేయడం వల్ల పిల్లలకి తల్లిదండ్రుల కష్టం విలువ కూడా తెలుస్తుంది.

పిల్లలకి టార్గెట్ కూడా ఇవ్వాలి నువ్వు ఇన్ని డబ్బులు సేవ్ చేస్తే నీకొక గిఫ్ట్ ఇస్తా అని.ఇలా చేయడం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలి.భవిష్యత్తు లో పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా తనంతట తాను సంపాదించుకుని బ్రతకగలను అనే ధైర్యం,నమ్మకం వాళ్లకు కలుగుతుంది.

 టీనేజ్ పిల్లలకు పొదుపు చేయడం ఎలా నేర్పించాలి?

ఈ వయసు పిల్లలను కంట్రోల్ చేయడం చాలా కష్టం.ఇంట్లో తల్లిదండ్రులు తెచ్చే డబ్బును మాత్రమే చూస్తారు.కానీ ఇంట్లో అవసరాలు చూడరు.వాళ్లు అడిగినపుడు డబ్బులు లేవు అని చెప్పి ఇవ్వకపోతే ఆరోజు నువ్వు డబ్బులు తెచ్చావు కదా.లేవని చెప్తున్నారు.నాకు ఇవ్వడం మీకు ఇష్టం లేదు అందుకే అలా చెప్తున్నారు అంటారు. తల్లిదండ్రులు కాదురా ఇంట్లో ఖర్చులు అని చెప్పేలోపు...నాకవన్ని చెప్పకు ఇస్తావా?ఇవ్వవా? అంటారు.

ఈ పిల్లలు ఏమి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాబట్టి, వాళ్లు హ్యాపీగా ఉన్న సమయం చూసుకుని వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి.డబ్బులు పొదుపు చేసిన వాళ్లు ఎలా బ్రతుకుతున్నారు,వృధా చేసిన వాళ్లు ఎలా బ్రతుకుతున్నారు.వాళ్లకు చెప్పాలి.వీలైతే చూపించాలి. వాళ్ళకి ఒక నోట్ బుక్ ఇచ్చి మి సంపాదన ఎంత? ఖర్చులు ఎంత? పొదుపు ఎంత? మొత్తం వాళ్ళతోనే రాయించాలి.అపుడు వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది.

ప్రతినెలా మీ సంపాదన ఖర్చులు పిల్లలతో నే రాయించాలీ.పిల్లలకి ముందే చెప్పాలి.చూడు నాన్న రేపు నీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ఎంతో కొంత సేవింగ్స్ చేయాలని. కాబట్టి ముందుగా ఎంతో కొంత పొదుపు పక్కన పెట్టిన తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చులకి సరిపోక పోతే కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి. ఇవన్నీ పిల్లలకి చెప్పి వారితోనే రాయించాలి.

 ఇలా చేయడం వల్ల పిల్లలకి ఇంట్లో అన్ని అర్థం అవుతాయి.కాబట్టి వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించుకుంటారు.వాళ్ళకి కూడా సంపాదించాలి.అనే ఆలోచన వస్తుంది.

చాలా మంది తల్లిదండ్రులు మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అని,మేము ఎన్ని కష్టాలు పడి అయినా సరే మా పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచాలి,అనుకుంటారు. మరి కొంతమంది మా పిల్లలని చాలా అపురూపంగా పెంచాము. ఏ కష్టం తెలియకుండా పెంచాం. అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటారు.మీరు మీ పిల్లలను అలా పెంచలేరు,అంటూ గొప్పలు చెప్పుకుంటారు.అది కరెక్ట్ కాదు. మరి కొంతమంది పిల్లలకి మనం పడే కష్టం గురించి చెప్తే పిల్లలు కూడా బాధపడతారు,చదువు పైన దృష్టి పెట్టరు అని అనుకుంటారు.ఇవే తల్లిదండ్రులు చేసే తప్పులు.పిల్లలకి కష్టం విలువ తెలియజేయాలి.అలాగే చదువు విలువ తెలియజేయాలి.

మధ్య తరగతి కుటుంబం లోని పిల్లలకి కాస్తయినా ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి.కానీ ధనవంతుల పిల్లలకే తెలియదు.ఆ పిల్లలే ఇపుడు ఎన్నో తప్పులు చేస్తూ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తున్నారు.అందుకు తల్లిదండ్రులు కూడా ఒక కారణం.కాబట్టి ఎంత డబ్బు ఉన్నవాళ్లు అయినా సరే పిల్లలకి డబ్బు విలువ తెలియజేయండి.మాకేం తక్కువ ఉందని మా పిల్లలు కష్టపడాలి వాళ్లు కూర్చుని తిన్నా మా ఆస్తులు తరిగిపోవు అంటూ చెప్పుకునే వాళ్లు కూడా ఉన్నారు.అలాంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలు బాగుపడరు.

 సామెత కూడా ఉంది కదా మొక్కై వంగనిది మానై వంగునా.అందుకే పిల్లలకి ఏది నేర్పించాలని అనుకున్న చిన్నప్పటి నుంచే నేర్పించాలి.అపుడే పిల్లలు మన మాట వింటారు.పెద్దయ్యాక వాళ్ళ మాటే మనం వినాల్సి వస్తుంది. వాళ్లకు కావల్సింది తల్లిదండ్రులు చేయకపోతే ఆత్మహత్య లు చేసుకున్న వాళ్లు ఎంతోమందిని మనం చూస్తున్నాం.15 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు స్మార్ట్ ఫోన్ కావాలని . మారాం చేస్తున్నారు. కొనివ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలను చిన్నప్పటి నుంచి సరైన క్రమశిక్షణతో పెంచితే ఇలాంటివి జరగవు.

కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది.ఇప్పుడు కొంచెం రిస్క్ అయినా సరే పిల్లలని మంచి క్రమశిక్షణ తో పెంచండి.పిల్లలకి ఫోన్లు దూరంగా ఉంచండి.ముందు ముందు మీరు,మీ పిల్లలు ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలంటే ఇప్పటినుంచే మీరు ఇవన్నీ ఆచరణలో పెట్టండి.

మీ పిల్లలను గొప్ప వాళ్ళు గా తీర్చి దిద్దండి ఇలా..

కోటీశ్వరులు కావడం ఏలా?

Post a Comment

0 Comments