పట్టుకూ ఓ కథ ఉంది
పట్టు వస్త్రాలు పట్టు దారాలు తయారీ
గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇందులో చాలా మంది శ్రమతోపాటు బోలెడన్ని
తయారీ దశలు ఉంటాయి. పట్టును గురించి పట్టు కు సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన విషయాల
గురించి మనము ఈ పోస్టులో తెలుసుకుందాం.
Sericulture
ప్రదర్శన - 1: పురుగు ( మాత్ ) నుంచి గుడ్డు
ఈ ప్రదర్శనలో గుడ్లు, వివిధ రకాల పురుగులు ప్రదర్శించి. పట్టుపురుగుల యొక్క గుడ్లను సర్వసాధారణంగా 'విత్తనాలు' అని పిలుస్తారు. పట్టు పురుగు సీతాకోకచిలుక మాదిరిగానే ఉంటుంది. ఈ పురుగుల వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదులలో ఉంచుతారు. పట్టుపురు గులను జాగ్రత్తగా చూసుకుంటారు వాటిని చిలకలు అని కూడా అంటారు.ఈ పట్టుపురుగులను 'బాంబిక్స్ మోరి' అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు.
పట్టు పురుగులు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లబట్ట ను కానీ కాగితాన్ని
కానీ పరుస్తారు పట్టుపురుగులు వందలకొద్దీ గుడ్లను పెడతాయి. ఒక ఆడ ఒకేసారి 500 గుడ్లు
పెట్టి తర్వాత చనిపోతుంది. ఈ గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి. మల్బరీ ఆకులతో పేర్చిన
మెత్తటి చాపల మీద ఈ గుడ్లు ఉంచి పోదిగిస్తారు. అప్పుడు వాటి లోంచి చిన్న చిన్న పురుగులు
వస్తాయి. ఈ పురుగులను వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకొని పోతారు. కొందరు సొంతంగా
గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పట్టుపురుగులను తీసుకొని పోతారు ఈ కేంద్రాలను గ్రైనేజస్ అంటారు. చిత్తూరు జిల్లా లో హార్సిలీ హిల్స్
దగ్గర అతిపెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది.
ts tet
tstrt
compitative exams
ప్రదర్శన-2 : గుడ్డు నుంచి కాయలు
ఇక్కడ పెద్ద పళ్లెంలో పట్టు పురుగులను మరియు ఆకులను వేసి ఉంచుతారు పట్టుపురుగులు ఆకులను తింటూ ఉంటాయి. సంవత్సరానికి 5 నుంచి 6 సార్లు పట్టు కాయల దిగుబడి ఉంటుంది. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ. చిన్నవిగా ఉండే తెల్లటి పట్టు పురుగులను హార్సిలీహిల్స్ దగ్గర ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కొనుక్కొని వస్తారు. వాటిని పల్లేలలో ఉంచి మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పట్టు పురుగులకు ఆహారంగా పెడతారు. ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి. అవి పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం తగినంత వెలుతురు అవసరం. ఇవి పెద్దవైన తర్వాత వెదురుతో చేసిన పల్లేలలో కి బదిలీ చేస్తారు.
ఈ వెదురు పల్లెలను చంద్రికలు అంటారు. 30 నుంచి 35 రోజుల తర్వాత గొంగళి పురుగు తినడం మానేస్తుంది. చంద్రిక లో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండి పోతుంది. అది తన చుట్టూ తాను వాళ్లను అల్లుకుంటుంది. పట్టు పురుగు నోటిని అటూ ఇటూ కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. గాలి వేడి తగలగానే ఈ పదార్థం గట్టిగా అవుతుంది. ఇదే పట్టు దారం. గొంగళి పురుగు ఈ దారంతో తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనపడుతుంది. దీన్నే పట్టు కాయ లేదా కకూన్ అంటారు. పట్టు పురుగు డింబకం కకూన్ లో అనేక రకాల మార్పులు చెంది పురుగు గా మారుతుంది.
రెండు నుంచి మూడు వారాల తరువాత పట్టు చిలుకలు కకూన్ నుంచి బయటికి వచ్చి ఎగిరి పోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కకూన్ ఏర్పడిన రెండు నుంచి మూడు రోజులకే వాటిని పళ్లెం నుంచి తొలగించాలి. డింబకా లను చంపడాన్ని స్టిఫ్ఫింగ్ అంటారు. డింబకాలను పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు.
కకూన్ ఉడికించడం
వల్ల డింభకా న్ని చంపవచ్చు లేకపోతే అది పట్టు చిలక గా మారి కకూన్ ను పగలగొట్టుకుని
బయటకు వస్తుంది. దానివల్ల కకూన్ లో పట్టు దారం తెగిపోతుంది. అటువంటి కకూన్ నుంచి బట్టలు
వేయడానికి సరిపోయే నాణ్యమైన పట్టుదారం పొందలేము. స్కిప్పింగ్ చేసినట్లయితే కకూన్ లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది.
రీలింగ్ కేంద్రాలలో ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఈ కకూన్ ను సీల్ చేసి బస్తాలు లో ఉంచి
మార్కెట్లో అమ్ముతారు. కకూన్ లను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది
ప్రదర్శన- 3: రీలింగ్ విధానం - కకూన్ నుంచి దారం తీయడం
పట్టు పురుగు పట్టకుండా దారాలతో ఏర్పరచుకుంటుంది. ఈ దారాల లో రెండు రకాల ప్రోటీన్లు (సిరిసిన్, ఫైబ్రోయిన్) ఉంటాయి. వీటివల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది. కకూన్ లను వేడి చేయడం వలన దారాలు సులువుగా బయటకు తీసి కండెలకు చుట్టడానికి వీలుగా మారుతుంది. గట్టు కాయల నుండి పట్టు దారాన్ని తీయడాన్ని 'రీలింగ్' అంటారు.
దీనికోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను
ఉపయోగిస్తారు. కకూన్ లనుంచి పట్టు దారాలను తీయడం లో చాలా జాగ్రత్తలు అవసరము. రీలింగ్
ద్వారా తీసిన ఆధారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి పట్టు తయారు చేస్తారు. దీన్ని శుభ్రంచేసి, విరంజనం చేసి తర్వాత కావలసిన రంగులో
ముంచుతారు. ఇలా తయారైన పట్టునూలుతో మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్లలో వస్త్రాలను
నేస్తారు.
ప్రదర్శన - 4: నేత నేయడం
తెలంగాణకు 'పట్టుపట్టణం' పోచంపల్లి.
రీలింగ్ కేంద్రాలనుండి పట్టు దారాన్ని కొని దానితో మగ్గాల పైన అందమైన వస్త్రాలను నేస్తారు.
తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవి పోచంపల్లి పట్టును 'టై అండ్ డై' లేక 'జమదాని' పట్టు అని కూడా పిలుస్తారు.
ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో మధ్య మధ్యలో బుటాలతో లేదా చుక్కల తో ఎంతో అందంగా
ఉంటాయి. బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఇలా రకరకాల
పట్టు వస్త్రాలు ఉంటాయి. అవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. టస్సర్
పట్టు, మూంగ పట్టు, కోసా పట్టు, ఈరీపట్టు ఇలా రకరకాల పేర్లు పట్టుకు ఉంటాయి. పట్టు నూలుకు
కొన్ని రకాల రసాయనాలను కలిపి గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తారు. పట్టు తో శాటిన్, క్రేప్
వంటి ఇతర రకాల వస్త్రాలను కూడా తయారుచేస్తారు. పట్టు వస్త్రాలు నేయడానికి నేత
మగ్గాలతో పాటు మరమగ్గాలు కూడా ఉపయోగిస్తారు.
పట్టు- ఎలా ప్రారంభమయింది
చైనీయుల ఆచారం, కన్ఫ్యూషియస్ రచనల ప్రకారం ఒక కథ ప్రచారంలో వుంది. క్రీ. పూ. 2,700 సంవత్సరంలో చైనా రాణి లీజు (హీ - లింగ్ - షి) రాజు (హాంగ్ - తాయ్) తో కలిసి మల్బరీ చెట్టు కింద అ కూర్చుని టీ తాగుతూ ఉన్నప్పుడు ఆమె కప్పులో పట్టు పురుగు పడింది. దాన్ని తీసే ప్రయత్నంలో కాకూన్ నుంచి దారం లాంటిది వచ్చింది. అప్పుడు రాణి దారం నేయడం గురించి ఆలోచించింది.
రాజు తన
భార్యతో పట్టు పురుగు జీవిత చరిత్ర అధ్యయనం చేయమని ప్రోత్సహించే సరికి పట్టు పరిశ్రమ
గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆమె పరిశోధనలు అందరికీ తెలియజేయడంతో పాటు
పరిశ్రమకు నాంది పలికి నట్లయింది. పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ
క్రీ. పూ. ఐదు వేల సంవత్సరాల నుండి క్రీ. పూ. మూడువేల సంవత్సరాల నాటి నుండే ప్రారంభమయిందని
ఆధారాలున్నాయి. జియా దేశంలో, యాంగ్ షాహు సంస్కృతి దృశ్యాలలో బాంబీక్స్ మోరి పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమ ప్రస్తావనలు ఉన్నాయి.
0 Comments