ఉన్నికి ఓ కథ ఉంది

 

ఉన్నికీ ఓ కథ ఉంది


Ts tet
TS trt

           జంతువుల వెంట్రుకలను 'ఉన్ని' లేదా 'ఫ్లీస్’ లేదా 'ఫర్' అని కూడా అంటారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్, కెరాటిన్ను కలిగి ఉంటాయి. మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. అందుకోసం వాటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటి ఉన్ని మూడు  నుంచి ఐదంగుళాల పొడవుగా, సన్నగా, మృదువుగా ఉంటుంది. ఇది చాలా విలువైనది. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది.

      రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు కాశ్మీర్ లో నివసించే అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకేవిధంగా ఉండవు. ఒంటె వెంట్రుకలు గరుకుగా, ముతకగా ఉంటాయి. కొన్ని జంతువులలో గరుకు వెంట్రుకల కింద మెత్తగా ఉండే ఉన్ని ఉంటుంది. అంగోరా గొర్రె మరియు మెరినో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది.

      వీటిని మనం జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, కలుపుతారు. ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో చూస్తాం.  అక్కడివారు పెద్ద సంఖ్యలో వీటిని పెంచుతారు.

      సాధారణంగా వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఈ పద్ధతిని కత్తిరించడం  (షీరింగ్) అంటారు. షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మం దెబ్బ తగలకుండా గ్రీజ్ను పూస్తారు.షీరింగ్ చేసిన వెంట్రుకలను తొట్టిలో ముంచి తెడ్లతో కలుపుతారు.. సాధారణంగా షీరింగ్ చేసిన వెంట్రుకలను పారే నీళ్ళలో ముంచి కడుగుతుంటారు. గ్రీజ్, దుమ్ము, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను ఈ తొట్లలో ఉండే నీటిలో కలుపుతారు. ఇలా చేయడాన్ని కడగడం లేదా స్కోరింగ్ అంటారు. నీటితో కడిగిన తరువాత చల్లని గాలిని పంపుతారు. దానివల్ల వెంట్రుకలు మెత్తగా అవుతాయి.

      గరుకు గా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగి పోయినవి, పొడవుగా ఉన్న వెంట్రుకలను వేరు చేసి కట్టలుగా కడతారు. ఈ పద్ధతిని 'వేరుచేయడం' లేదా 'ఊల్  క్లాసింగ్' అంటారు ప్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు. యంత్రాల సహాయంతో ఉన్నిని గట్టి దృఢమైన తాడుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతారు దీన్ని స్పిన్నింగ్ అంటారు.

వస్త్రాలను అల్లడం

ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు. దీన్ని 'అల్లడం' ( నిట్టింగ్) అంటారు.పత్తి, ఉన్ని, పట్టు దారం ఏదైనప్పటికీ మగ్గంమీద నేసే విధానం ఒకేవిధంగా ఉంటుంది. మగ్గంలో దారాలు పైనుండి కిందికి వేలాడుతూ ఉంటాయి. వీటిని 'నిలువు దారాలు (పడుగు) అంటారు. వీటికి అడ్డంగా పక్కపక్కగా ఉండే దారాలను ‘అడ్డుదారాలు (పేక') అంటారు. ఒక కండెలాంటి సూది అడ్డుదారాలను ఒకసారి ఒకసారి లోపలికి వెళ్ళేలా ఏకాంతరంగా మారుస్తూ ఉంటుంది.

 

మగ్గంలో మరొక ముఖ్యభాగం పటక (హర్నస్). ఇది ప్రతి నిలువు దారాన్ని పైకిలేపి అడ్డుదారాలు దానికి కిందనుండి, పైనుండి పోవడానికి వీలుకలిగిస్తుంది. ఇలా మగ్గంలో వస్త్రం తయారవుతుంది


మీకు తెలుసా?

     ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరంలోపలి వేడిని బయటకి పోనీయకుండా కాపాడుతుంది. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది. చలినుండి రక్షణ పొందుతాం. ఎడారి ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడుతారు. ఎందుకో ఆలోచించండి. ఉన్ని దుస్తులు మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి.

ఉన్ని ప్రపంచం :

 

        ఉన్ని దుస్తులు ప్రాచీన మానవ నాగరికత అంత  పురాతనమైనవి. పురావస్తుశాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీ.పూ. 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఉన్నితో తయారుచేసిన ఆభరణాలు క్రీ.పూ. 3000-2000 సంవత్సరాల క్రితం నాడే  ఉపయోగించేవారట.

 

                 15వ శతాబ్దంలో బ్రిటిషువాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. వాటికి సంబంధించిన చట్టాలను రూపొందించారు. ఇందులో  భాగంగా ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే చేతులు నరికేసేవారు. పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో ఉన్ని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులు.

నూలు నేయడం-ఊలు అల్లడం :





            మొక్కలు నుండి, జంతువుల నుండి అన్నిని తీసి వస్త్రాలు నేయడం  క్రీ.పూ. 7000 సం॥ల క్రితమే ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలున్నాయి. మధ్య ప్రాశ్చ్య దేశాలలో నేత నేయడంలో ఉపయోగించిన కండెలను ఈ చిత్రంలో చూడవచ్చు. నూలు, ఊలు దారాలను కండెలకు చుట్టి నేతనేయడం ఆసియా మైనర్ దేశాలలో కూడా ఇదే కాలంలో ఉన్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 5000సం||ల నాటికే నేత మగ్గాలను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ శిల్పంలో నేత పరికరాన్ని ఉపయోగిస్తున్న మహిళను చూడవచ్చు. ఇది క్రీ.పూ. 8వ శతాబ్దికి చెందిన శిల్పం.

 

Post a Comment

0 Comments