ఆహారం లోని అంశాలు

 7వ తరగతి సంమన్య శాస్త్రం

1.ఆహారంలోని అంశాలు


ü
మనం తినే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు,కొవ్వులు,విటమిన్లు,ఖనిజ లవణాలు,వుంటాయి.వీటిని మనం ఆవశ్యక అంశాలుగా పేర్కొంటాం.

పరీక్ష పేరు

కావలసిన పదార్థాలు

ఫలితం

పిండిపదార్తాన్నినిర్దారించే పరీక్ష

సజల అయోడిన్ ద్రావణం,ఆహార పదార్ధం.

ముదురు నీలి రంగులోకి మారుతుంది.

కొవ్వు పదార్థాలను నిర్దారించే పరీక్ష

ఆహార పదార్ధం,తెల్లకాగితము.

కాగితం పారదర్శకంగా మారింది.

ప్రోటీన్లను నిర్దారించే పరీక్ష

నీరు,2% కాపర్సాల్ఫేట్ ద్రావణం,10%సోడియం హైడ్రాక్సైడ్,ఆహారపదార్ధం.

పదార్ధం నీలిరంగు నుంచి ముదురునీలిరంగులోకి మారుతుంది.

 

ü ఒక్కొక్క రకం ఆహార పదార్థంలో ఒక్కొక్క అంశం ఎక్కువ పరిమాణంలో వుంటుంది.

i.e బియ్యంలో పిండిపదార్థం ఎక్కువగా, నూనెలో కొవ్వు పదార్ధం ఎక్కువగావుంటుంది.

ü పండ్లు,కూరగాయలను తొక్కలు తొలగించకుండా తినాలి.ఎందుకంటే అందులో ఎక్కువ మొత్తంలో పోషకపదార్థాలు, పీచు పదార్థాలు వుండి జీర్ణక్రియకు తోడ్పడుతాయి.

ü 1752లో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త తాజా ఫలాలను కూరగాయలను తినడంవల్ల స్కర్వి అనే వ్యాదిని నయంచేయవచ్చని కనుగొన్నారు.

ü మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు ,పిండిపదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దంలో నిరూపించడం జరిగింది.

ü పోషణ పైన లేవోయిజర్ అనే ప్రెంచ్ వైజ్ఞానిక శాస్త్రవేత్త (1743 నుంచి 1793)చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి.



 👉To Join Our Telegram group

 👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE


 

Post a Comment

0 Comments