సంపన్నులు కావాలనుకుంటున్నారా?
కోటీశ్వరులు కావాలని చాలా మంది అనుకుంటారు.కానీ అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు.ఇంకొంతమంది తమకు సాధ్యం కాదని ఫిక్స్ అయిపోతారు.ప్రపంచంలోని కుబేరులు సంపాదిస్తుంటే చూసి వాళ్లు గ్రేట్ చాలా సంపాదిస్తున్నారు అనుకుంటారు. బిలియనీర్లలో చాలా మంది జీరో నుంచి వచ్చినవారే.మరి మనం కోటీశ్వరులు కావడం సాధ్యం కాదని అనుకుంటే ఎలా? కోటీశ్వరులు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.దానికి చక్కని ప్రణాళిక కూడా ఉండాలి.
ధనవంతులు అవ్వాలంటే మొదటిది ఒకటికన్న ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం,
రెండవది ఆ సంపాదించిన డబ్బును ఆదాయాన్ని అందించే సామర్థ్యం ఉన్న ఆస్తులను కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించడం,
మూడవది ఈ పనులన్నింటినీ ఎలా చేయాలి అని నిర్దేశించే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం. ఆర్థిక ప్రణాళికలో గుర్తించాల్సిన ప్రధానమైన అంశాలు ఏంటంటే మీకు వచ్చే ఆదాయం ఎంత? ఖర్చులు ఎంత? పొదుపు ఎంత? మీ ఆస్తులు ఎన్ని? అప్పులు ఎంత? మీ కుటుంబానికి తగినంత ఆరోగ్య మరియు జీవిత భీమా ఉందా? అనే వాటిమీద పూర్తి అవగాహనతో మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఒక చక్కని కార్యాచరణ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని దానికి నిరంతర శ్రమ తోడైతే 10-15 సంవత్సరాల కాలంలో ఎవరైనా కోటి రూపాయల సంపద కూడబెట్టవచ్చు. దీనికోసం ఒక ప్రణాళిక ఉంది. అదే SCR ఆర్థిక ప్రణాళిక.
S అంటే సేఫ్టీ, C అంటే కంఫర్టబుల్, R అంటే రిచ్ ప్లాన్ అని అర్థం.
ఈ ప్రణాళిక సంపద సృష్టికి,ఆర్థిక పరిణామ క్రమంలో పురోగతి సాధించడానికి తోడ్పడుతుంది.ఈ ప్రణాళిక వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఒక వ్యక్తి ఆర్థిక పరిణామం చెందడానికి ఈ ప్రణాళిక ఎలా ఉపయోగపుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
Safety plan:
సేఫ్టీ అనేది పునాది అయితే అభివృద్ధి అనేది ఆ పునాది మీద నిర్మించే సౌధం లాంటిది.పునాది ఎంత గట్టిగా ఉంటే ఆర్థిక భవిష్యత్ అంత భద్రంగా ఉంటుంది.
భవిష్యత్ భద్రంగా ఉండాలంటే ఆర్థిక భద్రత,ఆరోగ్య భద్రత,జీవిత భద్రత,పటిష్టంగా ఉండాలి.ముందుగా జీవించడానికి అవసరమైన కనీస ఆర్థిక భద్రతను కలిగించే వాటిని సమకూర్చుకోవడం ఈ సేఫ్టీ ప్లాన్ ప్రధాన లక్ష్యం.అవేమిటంటే అత్యవసర నిధి,ఆరోగ్య భీమా,జీవిత భీమా,బంగారం.మీ ఆర్థిక ప్రణాళికలో వీటిని కనుక సరైన విధంగా కలిగి ఉన్నట్లైతే మీ జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుండి ఇవి మిమ్మల్ని కాపాడతాయి.అంతే కాకుండా ఆర్థికంగా పతనం కాకుండా అడ్డుకట్ట వేస్తాయి.
Comfort plan
జీవితంలో ఎటువంటి అనూహ్య పరిణామాలు ఏర్పడినా ఆర్థికంగా తిరోగమనం చెందకుండా సేఫ్టీ ప్లాన్ ద్వారా ఏర్పాట్లు చేసుకున్నాక ఆర్థిక పరిణామ క్రమంలో తర్వాతి దశకు చేరుకోవడానికి సిద్దం కావాలి. కంఫర్టబుల్ జీవితానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనవి సొంత ఇల్లు,కారు,పదవి విరమణ అనంతరం జీవించడానికి అవసరమైన ఆదాయం.
Rich plan
వారసత్వంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు లభించడం లేదా కోట్ల రూపాయలు లాటరీ గెలుచుకోవడం వంటివి కాకుండా సొంతంగా డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వలన్నా,ఆర్థిక పరిణామ క్రమంలో ప్రస్తుతమున్న దశ నుండి తర్వాతి దశకు చేరుకోవాలన్నా స్థూలంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం,రెండవది ఇతరులు ప్రారంభించిన వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం. స్టాక్ మార్కెట్లు,వంటి వాటిపై పెట్టుబడులు పెట్టడం.
SCR ఆర్థిక ప్రణాళికను అమలుచేయడంలో ఈ కింది అంశాలు గుర్తుంచుకోవాలి.
1.ఈ ప్రణాళికలో మొదటి దశ అయిన సేఫ్టీ ప్లాన్ ను అమలు చేయకుండా తర్వాతి దశలకు వెళ్ళకూడదు.అయితే ఇందులో చెప్పిన అత్యవసర నిధి,ఆరోగ్య భీమా,జీవిత భీమా,బంగారం వంటివి ఎంత మొత్తం అనేది మీ ఆదాయం,కుటుంబ అవసరాలను బట్టి నిర్ణయించుకోవచ్చు.కాలం గడుస్తూ ఆదాయం పెరుగుతున్న కొద్ది,జీవితంలో వివాహం జరగడం,పిల్లలు కలగడం వంటి మార్పులు జరుగుతున్నపుడు ఈ పెట్టుబడి మొత్తాలను పునః సమీక్షించి,అప్పటి అవసరాలు,లక్ష్యాల ఆధారంగమార్పులు చేసుకోవాలి.చేయడం జరుగుతుంది.
2.ఇక ఈ ప్రణాళికలో రెండవ దశ అమలు చేసే సమయానికి మీరు కనీసం రెండవ ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవాలి.అప్పుడే కంఫర్టబుల్ ప్లాన్ అమలు చేయడానికి అవసరమైన పెట్టుబడులను సులభంగా సమకూర్చుకొగలుగుతారు.
3.సేఫ్టీ ప్లాన్,కంఫర్టబుల్ ప్లాన్ అమలు చేయగా మిగిలిన ఆదాయాన్ని రిచ్ ప్లాన్ లో చెప్పిన పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టండి.
4.రిచ్ ప్లాన్ అమలు చేయడం ద్వారా సంపాదించే ఆదాయాన్ని,లాభాలను మరలా రిచ్ ప్లాన్ లో పేర్కొన్న ఆస్తులను సమకూర్చు కో వడానికే వినియోగించడం ద్వారా 'snake game formula' వలన మీరు ఊహించని రీతిలో సంపద సృష్టించబడుతుంది.
5.మీరు సంపాదించే క్రియాశీల ఆదాయంలో కనీసం 25 శాతం, నిష్క్రియా ఆదాయంలో 75 శాతం,పోర్టుఫోలియో ఆదాయంలో నూటికి నూరు శాతం పెట్టుబడులకు ఉపయోగించడం ద్వారా మీ సంపద వృద్ధి వేగవంతమై,ఆర్థిక పరిణామక్రమంలో దశలను స్వల్ప కాలంలో దాటడానికి దోహద పడుతుంది.
6.ఈ SCR ఆర్థిక ప్రణాళికను ఆర్థిక పరిణామ క్రమంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని జీవితంలో క్రమంగా ఆర్థికాభవృద్ధి చెందుతూ పై స్థాయిలకు చేరుకునే కోణంలో తయారు చేయబడింది. ఒకవేళ మీరు ఇందులో చెప్పిన అంశాలు ఇప్పటికే సాధించి ఉన్నట్లైతే తర్వాతి దశ అంశాల మీద దృష్టి సారించండి.మీరు ఆర్థికంగా ప్రస్తుతం ఏ దశలో ఉన్నప్పటికీ ఈ మూడంచెల structure అలాగే ఉంచండి.
ఇదంతా చదివిన తర్వాత మేము ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించు కొగలమా? ధనవంతులు అవగలమా? అనే సందేహాలు,సంశయాలు,అప నమ్మకాలు వీడండి.
ఒకవ్యక్తి ఆర్థికంగా పురోగమించకపోవడానికి ఆ వ్యక్తి ఆలోచనలు,వ్యక్తిత్వ వైఖరి,తనకు తాను విధించుకున్న పరిమితులు తప్ప ఇతర అడ్డంకులు,కారణాలు కనబడటం లేదు.ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు.పేదరికం తప్ప.
👉 పై అంశాలనుఅనే నాగరాజు మున్నూరు గారు రాసిన ఆలోచన మారితే జీ ఇతం మారుతుంది అనే పుస్తకము ఆధారంగా రాయడం జరిగింది.
👉ఈ పుస్తకము కావాలనుకునేవారు CLICK HERE
0 Comments