మీ పిల్లలను గొప్పవాళ్ళు గా తీర్చి దిద్దండి ఇలా

 మీ పిల్లలను గొప్పవాళ్ళు గా తీర్చి దిద్దండి ఇలా ...



ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే.మా పిల్లలు మంచి చదువులు చదవాలి,అందరిలో గొప్ప పేరు సంపాదించుకోవాలి,అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి అని.

కానీ ఆ విధంగా గొప్ప వాళ్లు కావాలంటే తల్లిదండ్రులు గా మనం చేయాల్సినవి చేస్తున్నామా లేదా అని ఆలోచిస్తున్నారా? పిల్లలని లక్షలు,లక్షలు డబ్బులు పెట్టీ స్కూల్ కి పంపించినంత మాత్రాన వారు గొప్పవారు అవరు. స్కూల్ కి పంపిస్తే చదువు వస్తుంది.కానీ సంస్కారం నేర్పాల్సినది మాత్రం మనమే.దాని కోసం తల్లిదండ్రులు పిల్లలకి ఏమేం నేర్పించాలి.

1.Money management

మొక్కై వంగనిది మానై వంగది.కాబట్టి ఏది నేర్పించాలన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.అప్పుడే పిల్లలు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు.డబ్బులు యే విధంగా ఖర్చు చేయాలి. ఏ విధంగా సేవింగ్స్ చేయాలి.అనేది చిన్నప్పటినుంచే నేర్పించాలి.

పిల్లలకి money management  గురించి ఎలా చెప్పాలి అనేది detail గా తర్వాత తెలుసుకుందాం.

2.Bed time good things 



చాలా మంది చిన్నపిల్లలు పడుకునే ముందు ఏడుస్తూ పడుకుంటారు,పొద్దున్న లేచేటపుడు కూడా ఏడుస్తూ లేస్తారు.పిల్లలకి 2 years నుంచే మంచి మంచి విషయాలూ చెప్తూ ఉండాలి మొదట్లో అర్థం చేసుకోకపోయినా చెప్తూ ఉంటే వాళ్ళే చేసుకుంటారు.కాబట్టి రోజూ పడుకునేముందు వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్పి పడుకో బెట్టాలి.కొంచెం పెద్ద పిల్లలైతే నీతి కథలు చెప్పి వారికి ఏం అర్థమైంది వాళ్ళనే  అడగాలి.నిద్ర పోయేముందు చెప్పిన విషయాలు బాగా గుర్తుంటాయి కాబట్టి,పిల్లలకి మంచి విషయాలు చెప్పడం వల్ల మైండ్ లో వాళ్ళకి గుర్తుండి పోతుంది.కాబట్టి ప్రతిరోజూ చెప్పాలి.

3.Early to bed early to rise

చాలా మంది పిల్లలు రాత్రి 11,12 అయినా కూడా నిద్రపోరు,ఉదయం వదిలేస్తే 10  అయినా లేవరు. స్కూల్ కి పంపడానికి పొద్దున ఎంత లేపినా లేవరు.బలవంతంగా లేపి టైం అవుతుంటే తొందర తొందరగా వాళ్ళని రెడీ చేయాలి.ఇది మంచి అలవాటు కాదు. కొందరైతే పాపం రాత్రి లేట్ గా పడుకున్నాడు లేట్ గా లేపుదాము అని 10 అయినా,ఏదో కష్టపడి night duty చేసి వచ్చిన వాళ్ళని లేపినట్లు ప్రేమగా లేపుతారు.అలా చేస్తే పిల్లలని ఇంకా సోమరులుగా తయారు చేసినట్లే.కాబట్టి పొద్దున్నే 5 గంటలకే నిద్ర లేపాలి.

తొందరగా నిద్ర లేవడం వల్ల పిల్లల మెదడు కూడా చురుకుగా ఉంటుంది.ఆరోగ్యానికి కూడా మంచిది.

4.Sharing



పిల్లలు తమ దగ్గర ఏది ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోమని చెప్పాలి.4 చాక్లెట్స్ ఉంటే 1 అయినా ఇవ్వాలి. పెన్,పెన్సిల్ ఇలా ఏదైనా అవసరం ఉంటే ఫ్రెండ్స్ కి ఇవ్వమని చెప్పాలి. ఇలా చిన్నప్పటి నుంచే చెప్పడం వల్ల పిల్లలకి పెద్దయ్యాక ఇతరులకు సహాయం చేయాలి, అనే మనస్థత్వం ఏర్పడుతుంది.

5. Focus on the routine

ఏ పని చేసినా ప్రణాళిక వేసుకుని చేయడం గొప్ప వారికున్న మంచి అలవాటు.కాబట్టి మన పిల్లలను కూడా గొప్ప వాళ్ళను చేయాలనుకుంటే వాళ్లు రోజూ చేసే పనుల మీద ఫోకస్ పెట్టేటట్లు చూడాలి.ఈరోజు చేసే పని రేపటికి వాయిదా వేయకూడదు ఎప్పటి పని అప్పుడే చేయాలి.ఈ విధంగా పిల్లలకి అలవాటు చేయాలి.

6.Make them responsible


పిల్లలు కామన్ గా పెద్ద వాళ్లు చెప్పినట్లు వినడానికి ఇష్టపడరు.వారికి నచ్చిన పనులే చేస్తారు.అలాంటపుడు తల్లిదండ్రులు ముందుగానే చెప్పాలి,నువ్వు చేసే పనికి నీదే పూర్తి బాధ్యత అని.ex.  ఏదైనా ఆకర్షణీయంగా ఒక బొమ్మ కనిపించిందని అనుకోండి.పిల్లలు అది కావాలంటారు.కొందామంటే దాని cost ఎక్కువ quality తక్కువ. ఆ విషయం పిల్లాడికి తెలియదు.కాబట్టి నాకదే కావాలని మారాం చేస్తాడు.అపుడు వాడికి ముందే చెప్పాలి.నేను వద్దంటున్నా కావాలంటునావు కదా రేపు అది పగిలి పోయినా ఆ బాధ్యత నీదే,అని చెప్పాలి. ఏదైనా తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవాలి.నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యుడవి నీ పొరపాట్లని ఇతరులపై ఆపాడించకూడదు.అని చెప్పాలి.

7.Ego

Ego ఇది చాలా మందిలో ఉంటుంది. ఈ ఈగో వల్ల చాలా నష్టాలు కలుగుతాయి మనిషి ఈగో ఎంత అదుపులో ఉంచుకుంటే అంత సంతోషంగా జీవించగలుగుతాడు.కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే కొన్ని విషయాలలో ఈగో లేకుండా ప్రవర్తించే విధంగా నేర్పించాలి.కింద చెప్పే విషయాలలో అస్సలు ఈగో ఉండరాదు.అవి

8.Yes,No,Please,Thank You,Sorry.

ఈ పదాలు వాడడానికి పిల్లలు ఇష్టపడరు వాళ్ళకి ఈగో అడ్డు వస్తుంది.కాబట్టి ఇతరులను ఏదైనా అదిగేటపుడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం,ఏదైనా తప్పు చేసినప్పుడు తమ తప్పు ఒప్పుకుని sorry చెప్పడం, ఎవరైనా సహాయం చేసినప్పుడు thank you చెప్పడం,చేసిన తప్పును yes నేనే చేశాను అని ఒప్పుకోవడం.ఇలాంటివి పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి.

గొప్ప, గొప్ప చదువులు చదివిన వారు ఇతరుల మనసులు గెలుచుకోరు.ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవారే ఇతరుల మనసులను గెలుచుకుంటారు. ఈ కాలంలో పెద్ద చదువులు చదివిన వాళ్లు జీవితంలో సంతోషంగా ఉంటారో లేదో కానీ ఈ లక్షణాలున్న ప్రతి ఒక్కరూ వారి మంచి మనసుతో ఇతరులకు మంచి చేస్తూ సంతోషంగా ఉండగలుగుతారు.స్కూల్ లో కేవలం మంచి ర్యాంక్ లు తెప్పించడానికి మాత్రమే పిల్లలపై ఫోకస్ పెడతారు.కానీ మంచి సంస్కారం మాత్రం కేవలం తల్లిదండ్రులు మాత్రమే నేర్పించగలుగుతారు. పది మందిలో ఉన్నపుడు మీ పిల్లలకి చదువు ఎంత వస్తది అని చూడరు.వాళ్ల ప్రవర్తన,వాళ్లు మాట్లాడే విధానం చూసి,వాడు మంచి వాడా,కాదా అని గుర్తిస్తారు.

మన పిల్లలు మంచివాళ్ళు గా గుర్తించ బడితే తల్లిదండ్రులకు అంత కంటే జీవితంలో ఇంకో సంతోషం ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు గుర్తుంచుకోండి మీ పిల్లల భవిష్యత్ మీ చేతిలోనే ఉంది.

Post a Comment

0 Comments