ఉష్ణం - కొలత

 ఉష్ణం - కొలత

వివిధ కాలాలలో జరిగే అనేక మార్పుల గురించి 6వ తరగతిలో 'మన చుట్టూ జరిగే మార్పులు' అనే పాఠంలో తెలుసుకున్నాం. వివిధ కాలాలలో జరిగే మార్పులకు అనుగుణంగా వివిధ రకాల దుస్తులను ధరిస్తామనికూడా చెప్పుకున్నాం.
శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఉన్ని బట్టలు ముదురు రంగు బట్టలు వేసుకుంటాం. ఇలాంటి బట్టలు మనకు వెచ్చదనాన్ని ఇస్తాయి. వేడిగా ఉన్నప్పుడు మనం లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోడానికి ప్రాధాన్యమిస్తాం. ఇవి మనకు కాలాలలో కొన్ని రకాల దుస్తులు వేసుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా!
చల్లదనాన్ని ఇస్తాయి. కొన్ని 
శీతాకాలం ఇంట్లో ఉన్నా కూడా చల్లగా ఉన్నట్లనిపిస్తుంది. వేడికోసం ఎండ (వెలుతురు) లోకి వస్తాంకదా! సూర్యుని వెలుతురు (ఎండ) మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో ఇంటిలోపల కూడా వేడిగా ఉంటుంది. ఒక వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఎంత? అనే అంశాలు ఎలా తెలుసుకుంటాం? ఈ ప్రశ్నలకు జవాబులు ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం.

ఇలా చేద్దాం :

కింది పట్టికలో ఉన్న వస్తువులు చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయా? (v) తో గుర్తించండి.


కొన్ని వస్తువులు చల్లగా, మరికొన్ని వస్తువులు వేడిగా ఉండడం చూస్తుంటాం కదా! కొన్ని వస్తువులు 63 ఇతర వస్తువులకన్నా వేడిగాను, మరికొన్ని వస్తువులు ఇతర వస్తువులకన్నా చల్లగాను ఉంటాయని మనకు ఎలా తెలుస్తుంది? ఒక వస్తువుకన్నా మరొక వస్తువు వేడిగా ఉందని ఎలా నిర్ణయిస్తాం? అలాగే ఒక వస్తువు కన్నా మరొక వస్తువు చల్లగా ఉందని ఎలా నిర్ణయిస్తాం? సాధారణంగా వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని ఉష్ణోగ్రతలో వ్యక్తపరుస్తారు. ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే 'ఉష్ణోగ్రత’.
పాలగ్లాసును మనం చేతితో తాకడంవల్ల పాలు తాగేంత వేడిగా ఉన్నాయో లేదో మరీ చల్లబడ్డాయా అన్నది అంచనా వేయగలం. పాలు పెరుగుగా తోడుపెట్టడానికి సరిపడేంత వేడిగా ఉన్నాయా అని చేతితోతాకి నిర్ధారిస్తాం. కాని కొన్నిసార్లు ఉష్ణోగ్రత అంచనావేయడంలో మన చేతులు మనకు తప్పుడు సమాచారాన్ని ఇస్తాయి.

కృత్యం-1 :

మూడు పాత్రలను తీసుకొని ఒకదాంట్లో

చల్లటినీరు, రెండోదాంట్లో సాధారణ నీరు, మూడోదాంట్లో వేడినీరు తీసుకోండి. చల్లటినీరుగల పాత్రలో ఎడమ చేయిని వేడినీరు గల పాత్రలో కుడిచేయిని ఒకేసారి ఉంచండి. రెండు మూడు నిమిషాల తరువాత రెండు చేతులు సాధారణ నీరున్న పాత్రలో ఉంచండి?

ఉష్ణం - ఒక రకమైన శక్తి:

మనం ఎండలోగానీ, మంటకు దగ్గరగాగానీ వెళ్ళినప్పుడు వేడిగా ఉంటుంది. మన చేతిని మంచుగడ్డమీద ఉంచినప్పుడు చల్లగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా జరగటానికి కారణం ఏమిటి?

ఆలోచించండి:

అన్నం వండేటప్పుడు పాత్ర పైన ఉన్న మూత ఎగిరిపడుతుంది. ఎందువల్ల?

మూత పెట్టివున్న గిన్నెలో నీటిని మరిగించడం మీరు చూశారా? ఏం గమనించారు? మూత పైకీ కిందికీ కదలడం చూశారా? మూత కదిలితే వచ్చే శబ్ధం విన్నారా? శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మూత ఎందుకు కదులుతుంది? కొన్ని సార్లు మూత ఎగిరి పడడం కూడా జరుగుతుంది. ఎందుకు? మరిగే నీరు, నీటి ఆవిరిగా మారుతుందని మనకు తెలుసుకదా! గిన్నెలో నీటి ఆవిరి ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరగడం వల్ల నీటి ఆవిరి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం గిన్నెపైనున్న మూతను పైకి లేపుతుంది. మూత పైకి లేవడానికి కారణం ఏమిటి? వస్తువును లేపడానికి శక్తి కావాలి. మరి ఈ శక్తి ఎక్కడనుంచి వస్తుంది? మరుగుతున్న నీటినుంచి ఈ శక్తి వచ్చిందని అనుకున్నట్లయితే నీటికి ఆ శక్తి ఎక్కడనుండి వచ్చింది? ఉష్ణంనుంచే కదా! కాబట్టి ఉష్ణం ఒక శక్తి వనరు అని చెప్పవచ్చు.

ఉష్ణం ఒకరకమైన శక్తి. అది ఎక్కువ ఉష్ణోగ్రతగల వస్తువునుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం జరుగుతుంది. మొదటి ఉదాహరణలో శక్తి సూర్యుని దగ్గరనుంచిగాని మంటనుంచిగాని మన శరీరంలోకి

రెండు చేతులూ ఒకే వెచ్చదనాన్ని సూచిస్తున్నాయా?

రెండు చేతులూ ఒకే నీరుగల పాత్రలో ఉన్నప్పటికీ ఒక చేతికి వెచ్చగాను, మరొక చేతికి అనిపిస్తున్నాయికదా! చూడండి! మన చేతులే వేరువేరు సమాచారాన్ని ఇస్తున్నాయి. మనం చేతితో తాకడంవల్ల వస్తువు కచ్చితంగా ఎంత వేడిగా ఉందో, ఎంత చల్లగా ఉందో చెప్పగలమా?

ఒక వస్తువు ఎంత వెచ్చగా ఉందనే విషయాన్ని మన అనుభూతి ద్వారా చెప్పలేం. చేతితో తాకడం ద్వారానే వేరు వేరు పాత్రలలో ఉన్న నీటి వెచ్చదనాన్ని ఖచ్చితంగా చెప్పలేం.
ప్రవహిస్తుంది. అందుకే మనకు వేడి అనిపిస్తుంది. రెండో ఉదాహరణలో మన శరీరంనుంచి శక్తి మంచుముక్కలోకి ప్రవహిస్తుంది. అందువల్ల మనకు చలిగా అనిపిస్తుంది. శక్తి ప్రసారంవల్ల వస్తువులు చల్లగాగానీ వేడిగాగానీ ఉన్నట్లు తెలియజేసే దాన్ని 'ఉష్ణం' అంటారు.

శక్తి మార్పులు ఇలా చేద్దాం:

👉రెండు అరచేతులు రుద్దండి. ఏమి గమనించారు?


👉సుత్తితో పదే పదే కొట్టినప్పుడు ఇనుము వేడెక్కడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?

👉ఒక కుంకుడు గింజను తీసుకొని రాతిమీద అరగదీయండి. గింజను తాకి చూడండి. ఏం గమనించారు.

👉పై సందర్భాలలో యాంత్రికశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది అని తెలుస్తుంది.

👉శీతాకాలంలో మీరెప్పుడైనా చల్లని నీళ్లతో స్నానంచేశారా? ఏం జరుగుతుంది?

👉చలినుంచి బయటపడడానికి నీవేం చేస్తావు?

చలికాలంలో మనకు వేడినీళ్ళు ఎలా లభిస్తాయి? వేడినీళ్ళకోసం మనం నీటిని వేడిచేస్తాం. మీ ఇంటిలో నీటిని ఎలా వేడిచేస్తారు? ఏ ఏ వనరులను వినియోగించుకుంటారు?

ఒకవేళ మీరు నీటిని వేడిచేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ను ఉపయోగించినట్లైతే విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది. అలాగే మీరు గ్యాస్ స్టవు వాడినట్లయితే రసాయనశక్తి ఉష్ణంగా మారుతుంది. సోలార్ హీటర్లను వినియోగించినట్లయితే సౌరశక్తి ఉష్ణంగా మారుతుంది.

Post a Comment

0 Comments