చలనం - కాలం
చలనం అనేది మన జీవితంలో ఒక సాధారణ అనుభవం వంటిది . పక్షులు, రోడ్డుమీద వెళ్లే వాహనాలు, ఆటోలు, ఎద్దుల బండ్లు, పట్టాలమీద రైళ్లు, ఇలా చలనంలో ఉండే అనేక రకాలైన అంశాలను మనం గమనిస్తూఉంటాం. ఇవేకాకుండా నడవడం, పరుగెత్తడం, ఆడుకోవడం, సైకిలు తొక్కడం మొదలైన వాటిని కూడా గమనిస్తాం. పాఠశాలకు వెళ్లేదారిలో చెట్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు, ప్రకటనల బోర్డులు మొదలైనవాటిని కూడా చూస్తాం. అయితే అవి కదలకుండా స్థిరంగా ఉంటాయి కదా!
ఉరుకడం, నడక, ఆటలు ఆడడం లాంటి సందర్భాలలో కాకుండా ఇలా ఏ ఏ సమయాల్లో మీరు చలనాలను గుర్తించారు. జాబితా తయారుచేయండి.
బస్సులోగాని, రైలులోగాని ప్రయాణం చేస్తున్నపుడు దారి పక్కనున్న చెట్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు కదులుతున్నట్లు గమనిస్తాం.
ఈ చెట్లు, భవనాలు, విద్యుత్ చలనంస్తంభాలు నిజంగా కదులుతున్నాయా? లేక స్థిరంగా ఉంటాయా?
దీనిని చేసుకోవాలంటే చలనాన్ని గురించి నిశ్చలత్వాన్ని గురించి తెలుసుకోవాలి.
చలనం - స్థిరత్వం :
ఈ కింది చిత్రాలను గమనించండి.
- కారు ఉన్న స్థితిలో ఏమి తేడా గమనించారు? చెట్టు ఉన్న స్థితిలో ఏమి తేడా గమనించారు?ఈ
- తేడా ఎందుకు వచ్చింది. చెప్పగలవా ?
- తేడా చెట్టుకు కారు కుడి వైపుకు జరగడం వల్ల గానీ వచ్చిందా కారు చెట్టుకు ఎడమ వైపుకు జరగడం వల్ల గానీ వచ్చిందా?ఇ
- క్కడ కారు స్థానం 2 సెకన్లలో చెట్టుకు ఒకవైపు నుండి మరోవైపుకు జరిగింది కదా . కాని చెట్టును పరిసరాలతో పోల్చి చూసినప్పుడు దాని దాని స్థానంలో మార్పు జరగలేదు. కదా.
ఒక వస్తువు దాని , తన పరిసరాలను బట్టి, ఒక నియమమైన కాలంలో, తన స్థానాన్ని మార్చుకొన్నట్లయితే, ఆ వస్తువు చలనంలో ఉన్నదని చెప్పవచ్చు.
ఒక వస్తువు, తన చుట్టూ వున్న పరిసరాలను బట్టి, ఒక కాలంలో, తన స్థానాన్ని మార్చుకోనట్లయితే, ఆ వస్తువు చలనంలో వుండదని చెబుతారు.
పై విషయాలను బట్టి, చెట్టు నిశ్చలస్థిత ఉందని, కారు చలనం లో ఉందని చెప్పగళం.
స్థిరంగా ఉన్న కొన్ని వస్తువులకూ, కదలికలో ఉన్న వస్తువులకూ కొన్ని ఉదాహరణలను ఇవ్వగలరా?
క్రమచలనం - క్రమరహిత చలనం:
ఒక వస్తువు కాలాన్ని బట్టి, గమనించే వ్యక్తి స్థానాన్ని బట్టి దాని స్థితిలో మార్పు కలుగుతున్నట్లయితే, ఆ వస్తువు చలనంలో ఉందని చెప్పవచ్చు. మన నిత్య జీవితంలో, కొన్ని వస్తువులు కాల కదలిక స్థిరంగాను, కొన్ని సమయాల్లో చలనంలో ఉన్నట్లు గమనిస్తాం. అయితే, ఒక నియమితకాలంలో వస్తువు స్థితిలో మార్పు ఒకే రకంగా ఉండ వలసిన అవసరం లేదు.
గోడగడియారంలోని ముళ్ళలో కదలికలను, సీతాకోక చిలుక గమనం గమనించండి. ఈ రెండు సందర్భాలలో, గోడగడియారం ల సూచికలు, సీతాకోకచిలుక శరీరం కదలిక ఉన్నాయి. కాలాన్ని బట్టి వాటిస్థితిలో మార్పువస్తుంద.
గడియారం ముళ్ళలోను, సీతాకోకచిలుక శరీరంలోని కదలికలలోను ఏం మార్పు గమనించారు?
ఈ పొలాని ఉన్న స్థితి ఏది?
గోడగడియారంలో, పెద్దముల్లు చలనం ప్రతి నిమిషానికి ఒకేవిధంగా మారుతుంది. కాని సీతాకోక చిలుక చలనంలో, ప్రతి నిమిషానికి చలనం ఒకేవిధంగా లేదు. తోటలో ఒక పువ్వునుంచి మరొక పువ్వుకు వెళ్ళేస్థితిలో మార్పు ఒకేవిధంగా ఉండదు.
దీన్ని మనం ఎలా తెలుసుకోగలం?
ఒక నిముషంలో గడియారం ముల్లు చేసే కోణాన్ని కొలిచినట్లయితే అది సమానంగా ఉంటుంది.
స్థానాంతర చలనం :
కింది చిత్రాలను చూడండి.బస్సు బిందువు 'A' నుండి, బిందువు 'B' కి కొంతకాలవ్యవధిలలో కదిలినది.
ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి.
1. బస్సుకున్న అన్ని భాగాలూ (పయ్యలు తలుపులు, ముందు అద్దాలు) బిందువు " నుండి, బిందువు 'B' కి కదులుతున్నాయా?
2. బస్సు తి
న్నని మార్గం మీద ప్రయాణిస్తోందా? లేక వక్రమార్గంలో ప్రయాణిస్తోందా?
ఒక నిర్థిష్ట దిశలో కదులుతున్న ఒక వస్తువుతోబాటు దానిలోని భాగాలూ అదే మార్గంలో కదులుతున్నాయిఅనడానికి మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు, సరళరేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని 'సరళరేఖీయ చలనం' అంటారు.
స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు, వక్రరేఖా మార్గంలో ఉన్నట్లయితే, ఆ చలనాన్ని 'వక్రరేఖీయచలనం' అంటారు.
భ్రమణ చలనం [Rotatory Motion]
1. పై చలనాలలో ఏమైనా సారూప్యత ఉందా?
2. గమనంలో వస్తువు ప్రతిబిందువు చలనంఏ మార్గంలో ఉంది?
3. వస్తువు చలనంలో ఉన్నపుడు దాని స్థితిలో మార్పు ఉంటుందా?
ఇంటి కప్పుకు బిగించిన పంఖా రెక్కలలో చలనాన్ని గమనిద్దాం. కింది పటంలో చూడండి. పంఖా ఒక రెక్క ఎలా భ్రమణ చలనాన్ని చూపుతుందో గమనించండి.
పంఖా తిరుగుతున్నప్పుడు, రెక్కలమీద ప్రతీ బిందువు వలయాకారంలో, స్థిరంగానున్న కేంద్రం చుట్టూ చలిస్తూ ఉంటుంది. పంఖా స్థితిలో మార్పు ఉండదు. కేవలం పంఖారెక్కలు మాత్రమే కదులు తున్నాయి. ఈ స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను 'భ్రమణ అక్షం' అంటారు. ఈ విధమైన చలనాన్ని 'భ్రమణ చలనం' అంటారు.
చలిస్తున్న ఒక వస్తువు చెందిన అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు or అక్షం చుట్టూ కదులుతుంటే, ఆ చలనాన్ని 'భ్రమణ చలనం' అంటారు.
1. కృత్యం - 7లో చూపించిన వస్తువులన్నీ భ్రమణ చలనంలో ఉన్నాయని చెప్పగలరా?
2. భ్రమణ చలనానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
డోలన చలనం [Oscillatory Motion]
కింది పటాలను పరిశీలించండి. ప్రశ్నలకు జవాబులివ్వండి.
- పైన చూపించిన చలనాలలో ఏమి సారూప్యంగమనించారు?
- ఆ వస్తువులు ఒకే మార్గంలో పదే పదేచలిస్తున్నాయా?
నెమ్మదిగా వేగంగా చలించడం :
- పాఠశాలకు ఎవరు ముందు చేరతారు? ఎందువల్ల?
- పాఠశాలకు చేరిన సమయాలలో భేదాన్ని గమనించావా?
0 Comments