గాలి - పవనాలు air

 గాలి -  పవనాలు



      మనం గాలివీచే దిశలో సైకిల్ తొక్కుతున్నప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది. గాలివీచే దిశకు ఎదురుగా సైకిల్ తొక్కేటప్పుడు చాలా అలసిపోయినట్లుగా అనిపించడం మనకు తెలుసు. TS tet,tstrt

    ఒక్కొక్కప్పుడు గాలి చాలా చల్లగా, హాయిగా అనిపిస్తే మరొకప్పుడు చాలా వేడిగా ఉన్నట్లనిపిస్తుంది. ఒక్కొక్కసారి గాలి మబ్బుల్ని మోసుకొస్తుంది. అలాగే చాలా బలంగా కూడా వీస్తుంది. దుమ్ము లేపుతుంది. గాలివీచే సమయంలో బట్టలు చాలా తొందరగా ఆరిపోతాయని మనకు తెలుసు.

     పవనాలు మన జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతాయి. అందుకని పవనాలు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? అనే విషయాలను తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే గాలి చాలా అరుదుగా మాత్రమే కదలకుండా ఉన్నట్లనిపిస్తుంది. అది నిరంత ఒక దిశ నుంచి మరొక దిశకు కదులుతూనే ఉంటుంది. గాలి కదలిక అనేక దిశలలో ఉంటుంది. కదిలే గాలిని మనం 'పవనం' అని పిలుస్తాం.

గాలి ఎక్కడ ఉంది?



        ఒక బకెట్ నిండుగా నీరు తీసుకోండి. ఒక గాజుగ్లాసులో అడుగున ఒక కాగితాన్ని ఉండలా చుట్టిిఉంచండి. గ్లాసును తలక్రిందులుచేసి బకెట్లోని నీటిలో పూర్తిగా ముంచండి. 


  • గ్లాసులో ఉన్న కాగితం తడిచిందా? లేదా?


  • గ్లాసును నీటిలో ముంచడంకోసం తలకిందులు చేసినప్పుడు ఏం జరుగుతుంది? మరోసారి చేసి చూడండ

కృత్యం:

     ఒక బకెట్ నిండుగా నీరు నింపండి. దానిలో ఒక సన్నని మూతిగల సీసాను ముంచి నీటితో నిండేటట్లు చేయండి.


  • నీరు సీసాలోకి నిండుతున్నప్పుడు దాని మూతి నుంచి ఏదైనా బయటకు రావడాన్ని గమనించారా?
  • ఏదైనా బయటకు వస్తున్నదీ, లేనిదీ నీవు ఎలా గుర్తిస్తావు?
  • లోపల ఏమీ కనిపించని సీసాగాని గ్లాసుగాని ఖాళీగా ఉందని అనుకుంటాం కానీ అది గాలితో నిండి ఉంటుందనేది నిజమా? కాదా?

          పైన పేర్కొన్న రెండు కృత్యాలు చేసిన తరువాత “గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది, ఖాళీగా కనిపించే సీసా, గ్లాసు ఏ ఇతర పాత్రలోనైనా గాలితో నిండి ఉంటాయని తెలుస్తుంది. పాత్రలో ఉండే గాలిని బయటకు పంపకుండా దానిలో మరేదీ నింపలేము. కొంతగాలి బయటకు పోతేనే కొంత వస్తువు లోపలికి పోగలుగుతుంది. మన చుట్టూరా గాలి ఆక్రమించి ఉంది.
        7th science , compitative Exams


గాలి పీడనాన్ని కలిగిస్తుంది :


           సైకిల్ ట్యూబ్లో గానీ, మరేదైనా ఇతర వాహనాలకు గానీ పరిమితిని మించి గాలి నింపితే ట్యూబ్ పగిలిపోతుంది కదా! ఇలా ఎందుకు జరుగుతుంది! ఎక్కువగా ఉన్న గాలి ట్యూబ్ను ఏమి చేస్తుంది? ట్యూబ్లో గాలి నింపగానే ట్యూబ్కు ఒక ఆకారం వస్తుంది కదా! ఇది ఎందుకు జరుగుతుందో మీ మిత్రులతో చర్చించండి.

         ఒక బెలూన్ తీసుకొని దానిలో గాలి నింపండి. ఇంకా ఇంకా ఊదుతూనే ఉండండి. ఏమి జరుగుతుంది? బెలూన్ పరిమాణం పెరిగిపెరిగి చివరికి పగిలిపోతుంది.

  • ఇది ఎందుకు పగిలిపోయింది?
  • ఈ ప్రయోగం ద్వారా గాలి పీడనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చా?

           గాలి పీడనం కలిగిస్తుందనడానికి మరికొన్ని ఉదాహరణలు చెప్పండి. ఉదాహరణకు బెలూన్లో గాలి నింపడం, ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం. చేతిపంపుతో నీరు పైకి రావడం, సైకిల్, స్కూటర్, కారుట్యూబ్లలో గాలి నింపడం మొదలైనవి. మీరూ మరికొన్ని ఉదాహరణలు ఆలోచించండి.

  • వేడి చేస్తే గాలి వ్యాకోచిస్తుంది.
  • వేడిగాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది.
  • గాలి పీడనం ని కలిగి ఉంటుంది.

గాలులు - భూమిమీద ఉష్ణోగ్రతావ్యత్యాసాలు :


            నదులు, సముద్రాల వంటి నీరుండే ప్రదేశాల పరిసరాలలో గాలి చూపే ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం కదా! భూమిమీద ఇతర ప్రదేశాలలో గాలి ఏ ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం. ఒక్కొక్క ప్రదేశంలో ఉష్ణోగ్రత ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకని?

      భూమిమీద ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలుండడానికి చాలా రకాల కారణాలుంటాయి.

వీటన్నింటి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

1. భూమధ్యరేఖా ప్రాంతానికీ, ధృవాలకూ మధ్య ఉష్ణోగ్రతావ్యత్యాసం :


               భూమధ్యరేఖ దగ్గర ధృవాల దగ్గర కన్నా సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుంది.దీనికి కారణం భూమధ్యరేఖ దగ్గర సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడడమే. అందువల్ల ఈ ప్రాంతంలో గాలి వేడిగా ఉంటుంది. ఇక్కడ ఏర్పడే తక్కువ పీడనంలోకి భూమధ్యరేఖకు ఇరువైపులా ఉ ండే 0° - 30° అక్షాంశ ప్రాంతంనుంచి చల్లని గాలులు వీస్తాయి. ఈ కదలిక భూగోళం మొత్తంమీద గాలి కదలికలకు దారితీస్తుంది.

          పెరుగుతున్న గాలివేగం పీడనాన్ని తగ్గించడంతోపాటు వర్షం కురవడానికి కూడా కారణమవుతుంది.

     పవనాలు ఎలా ఏర్పడతాయో అవి వర్షాన్ని ఎలా కురిపిస్తాయో, కొన్ని సమయాలలో ఎలా నష్టం కలిగిస్తాయో తెలుసుకుందాం.

2. భూమి, నీరు - ఉష్ణోగ్రతావ్యత్యాసాలు :


         సముద్ర పవనాలు, భూపవనాల గురించి మీరు తెలుసుకున్నారు కదా! భూమధ్యరేఖాప్రాంతంలో పగటిపూట భూమి బాగా వేడెక్కుతుంది. భూమిపైన ఉ ండే గాలిపొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇది సముద్రపు గాలులు భూమి మీదకి రావడానికి కారణమవుతుంది. ప్రత్యేక సమయాలలో ఇలా వీచే గాలులను 'ఋతుపవనాలు' అని పిలుస్తాం. ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది.

             డిశంబర్ - మార్చి నెలల మధ్యకాలంలో దీనికి పూర్తిగా వ్యతిరేక పరిస్థితి ఏర్పడుతుంది. సముద్రం నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి భూమిమీది గాలులు సముద్రంమీదికి వీస్తాయి. సముద్రంనుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి (వర్షం ఎలా కురుస్తుందో 6వ తరగతిలో చదివారు కదా). రైతులు వర్షాలమీద ఆధారపడి వ్యవసాయం పనులు మొదలుపెడతారు. గాలి మరలు ఉపయోగించి విద్యుత్ను కూడా తయారుచేస్తారు (ఇది ఒక సాంప్రదాయేతర ఇంధనవనరు). ఇలా గాలి వల్ల మనకు అనేక ఉపయోగాలు కలుగుతున్నాయి.

గాలివల్ల కలిగే లాభాలు

            గాలులు నష్టాలను కూడా కలిగిస్తాయా? తెలుసుకుందాం! మీరు 'తుఫాను' గురించి వినే ఉంటారు కదా! సాధారణంగా మే - జూన్ లేదా అక్టోబర్ నవంబర్ నెలలో వార్తాపత్రికలలో టి.వి.లలో వాతావరణ సమాచారంలో తుఫాన్ గురించి వింటూంటాం.

తుఫానులు :


             భూమిమీద వీచే పెనుగాలులనే తుఫాను అనవచ్చు. తుఫానులను హరికేన్లు, టైపూన్లు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇవి ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు. వార్తాపత్రికలు పరిశీలించి తుఫానుల పేర్లు సేకరించండి. ఉదా : 'లైలా తుఫాను'

        తుఫాను ఎలా ఏర్పడుతుందో తెలుసుకోడానికి కింది ప్రయోగం చేద్దాం.

కృత్యం :
         ఒక గ్లాసు నిండా నీరు, రెండు స్ట్రాలు తీసుకోండి. ఒక స్ట్రాను నీళ్ళలో ఉంచండి. రెండోదాన్ని పటం-9లో చూపినట్లు క్షితిజ సమాంతరంగా ఉండేలా నోటిలో A ఉంచుకోండి. దానిగుండా గాలి ఊదండి. 
  • గ్లాసులోనిి నీళ్ళలో ఏమైనా మర్పు గమనించారా? 
  • ఏమిి గమనించారు? స్ట్రానుంచి నీరు ఎందుకు పైకి చిందింది? మీ స్నేహితులతో చర్చించండి. 
         స్ట్రాా గుండా గాలి ఊదినప్పుడు నీళ్ళలో ఉండే స్ట్రాలో పీడనం తగ్గుతుంది. అపుడు గ్లాసులో నీటిమీద బయటి గాలి పీడనంవల్ల గ్లాసులోని నీరు స్ట్రాలోకి వస్తుంది. అది బయటకు వచ్చాకా మనం ఊదే గాలివల్ల ముందుకు చిందుతుంది. గాలి వేగం పెరిగినప్పుడు గాలి వేగంతోపాటుగా గాలి పీడనం తగ్గును అని మనం
పరిశీలించవచ్చును.

తుఫానులు ఎలా ఏర్పడతాయి :

         ఉపరితల తుఫానులు అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేసే పెద్ద యంత్రాలవంటివి. వెచ్చని నీటి ఆవిరి సముద్రాల ఉపరితలం నుంచి పైకిపోతుంది అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుంది. చుట్టు పక్కల పరిసరాలలో ఉండే గాలి ఇక్కడికి చొచ్చుకు వస్తుంది. ఇలా కొత్తగా వచ్చి చేరిన గాలికూడా వేడెక్కి పైకిపోతుంది. ఇలా వరుసగా పరిసరాలలో గాలినంతా లోపలికి లాక్కొని వేడెక్కించి పైకి పోయేలా చేస్తుండడంతో సముద్రంలోని ఉపరితల నీరు కూడా కృత్యం-11లో చూసినట్లు పైకి వస్తుంది. వేడెక్కి పైకి వెళ్ళిన గాలి చల్లబడగానే గాలిలోని నీటి ఆవిరి మేఘంగా మారుతుంది.



           సముద్రపు వేడిగాలికి ఆవిరైన నీటివల్ల ఏర్పడిన మేఘాలు గాలితోబాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింతగా పెంచుకుంటాయి. అందువల్ల కన్నులాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఇలాంటి ఆకారాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు.

తుఫానుకు దారితీసే కారకాలు :


            గాలివేగం, గాలి వీచే దిశ, ఉష్ణోగ్రత, ఆర్ద్రత మొదలైనవన్నీ తుఫానులు ఏర్పడడానికి దారితీస్తాయి. మనదేశంలో సాధారణంగా మే-జూన్, అక్టోబర్-నవంబర్ నెలలలో తుఫానులు వస్తాయి. బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫానులు ఏర్పడతాయి.

తుఫానులవల్ల కలిగే నష్టాలు :

            తుఫానులు మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. తుఫానులు ఎక్కువ వర్షం, బలమైన గాలులతో నష్టం కలిగిస్తాయి. తుఫానులవల్ల కలిగే నష్టాలు తుఫాను తీవ్రత, దాని పరిమాణం అది ఏర్పడే ప్రదేశంమీద ఆధారపడి ఉంటుంది.


  • మీరు ఎప్పుడైనా తుఫానువల్ల కలిగే నష్టాల గురించి విన్నారా? వాటిని మీ నోటుపుస్తకంలో రాయండి.

  • వార్తా పత్రికలలో తుఫానులను గురించిన సమాచారం సేకరించండి. దానితో స్క్రాబుక్ను తయారుచేయండి. నివేదిక రూపొందించండి.
తుఫాను సమయంలో చేయవలసినవి - చేయగూడనివి:
    ( Precotions of storm, rain)
  • తుఫాను గురించి వాతావరణ శాఖ టి.వి., కల ద్వారా ఇచ్చే సమాచారాన్ని, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. పుకార్లను నమ్మకండి.

  • మీ ప్రాంతానికి సంబంధించి తుఫాను హెచ్చరికలు ఉన్నపుడు మీ రోజువారీ పనులు చేసుకుంటూనే రేడియోలో వచ్చే హెచ్చరికలు గమనించండి.

  • ఇంటిలో విద్యుత్ సరఫరా చేసే 'మెయిన్' ఆపివేయండి.

  • పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్యసేవకుసంబంధించిన ఫోన్ నంబర్లను సిద్ధంగా ఉంచుకోండి.

  • మీ కుటుంబానికి కొన్ని రోజులకు కావలసిన నిత్యావసరాలను, మందులను పిల్లలకు, పెద్దలకు సరిపడా ఆహారం సిద్ధం చేసుకోవాలి.

తుఫాను తరవాత చేయవలసినవి :

      మీరు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్నట్లయితే ఈ పనులు చేయండి.

  • వేలాడుతున్న విద్యుత్ తీగలను పట్టుకోవద్దు. 
  • కలుషితమైన నీటిని తాగవద్దు. అత్యవసరంగా తాగడానికి తగినంత నీటిని నిలవచేసుకోండి.

  • వరద నీటిలోకి, కూలిన చెట్లు, భవనాల దగ్గరకు సరదాకోసం వెళ్ళకండి.

  • మీ ఇరుగుపొరుగువారికి సహాయంఅందించ దానికి  సిద్ధంగా ఉండండి. 
                   నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తుఫాను ప్రమాదాలనుంచి రక్షించుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శతాబ్దం తొలినాళ్ళలో తుఫానుల నుంచి రక్షించుకోడానికి ఒక్క గంట వ్యవధి కూడా ఉండేది కాదు. ప్రస్తుతం ప్రపంచం చాలా మారిపోయింది. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. 48గంటల ముందుగానే తుఫాను గురించిన సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీచేయడానికి వీలుకలుగుతుంది. తుఫాను సముద్రంలో ఎక్కడ ఉంది? ఎక్కడ తీరం దాటుతుంది? తీవ్రత ఎంత? అనే విషయాలను గంటగంటకూ తెలుసుకోడానికి వీలు కలుగుతోంది. వాతావరణశాఖ (Indian Meteorological Department - IMD) ఈ సమాచారాన్ని మనకు అందిస్తుంది.



 

Post a Comment

0 Comments